📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Tirupati: టిటిడి బోర్డుకు జంగా కృష్ణమూర్తి గుడ్ బై

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఎంకు సమస్య లేకుండా రాజీనామా చేశానని వెల్లడి

విజయవాడ : (Tirupati) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి (CM Chandrababu) పంపారు. తన రాజీ నామాను వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో సీఎంకు జంగా కృష్ణమూర్తి విజప్తిచేశారు. ఈ పదవి కి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆ లేఖ లో జంగా వివరించినట్లు తెలుస్తోంది. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్లో ప్లాట్ నెంబర్ 2 నేటికీ ఖాళీగానే ఉందని, దీనిని తనకు కేటాయిం చాలంటూ ప్రభుత్వాన్ని కోరానని సమాచారం. దీనిని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం పంపడంతో ఆమో దముద్ర పడినట్లు తెలుస్తోంది. అయితే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ఆయన టీటీడీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.

Read also: Rajya Sabha MPs Retirement: ఇద్దరు ‘పెద్దలు’ త్వరలో రిటైర్

Janga Krishnamurthy bids goodbye to TTD Board

భూ కేటాయింపు వివాదమే రాజీనామాకు కారణమా?

2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దాంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాంతో (Tirupati) టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని నియమించి.. పాలక మండలి సభ్యులుగా పలువురుని నియమించారు. ఆ జాబితాలో జంగా కృష్ణమూర్తికి స్థానం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జంగా కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. 2005లో తాను టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలో తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని కోరినట్లు జంగా తెలిపారు. తన విజప్తి మేరకు భూమిని ఇచ్చారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కానీ ఆ సమయంలో ఆర్థిక వెసులుబాటు లేక గెస్ట్ హౌస్ నిర్మించ లేకపోయానని తెలిపారు.

టీడీపీకి రాజీనామా చేయలేదని స్పష్టం

మళ్లీ తనకు స్థలం కేటాయించాలని తాజాగా టీటీడీని కోరానని పేర్కొన్నారు. అందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసి ముఖ్యమంత్రికి పంపిందని చెప్పుకొచ్చారు. ఈ భూమిని తనకు కేటాయించాలా, వద్దా? అనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. ఈ తీర్మానంపై టీటీడీ బోర్డులో సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ ఒక్కరే వ్యతిరేకించారని పేర్కొన్నారు. తనకు స్థలం కేటాయించడం ద్వారా బోర్డు తప్పు చేసిందనే ఆలోచన రాకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. టీటీడీ బోర్డుకు స్థలం కేటాయించడానికి హక్కు లేదా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్ గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరానంటూ జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. తాను టీడీపీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేసారు. ఈ క్రమంలో ఆయనను శనివారం ఉండవల్లి సీఎంక్యాంపు కార్యాలయానికి రావాలని రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్ ఫోన్ చేసినట్లు కీలక సమాచారం.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



Andhra Pradesh Chandrababu Naidu Janga Krishnamurthy Latest News in Telugu Telugu News Tirumala Tirupati Devasthanams TTD board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.