📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్

Author Icon By Divya Vani M
Updated: March 29, 2025 • 7:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్ తిరుపతిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి, భారీగా డబ్బు డిమాండ్ చేశారు. వారి కుట్రను భగ్నం చేసేందుకు రాజేష్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం హృదయ విదారకంగా మారింది.శుక్రవారం సాయంత్రం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ కుటుంబ సభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. మిగతా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి రాజేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.చిత్తూరులో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్లి డబ్బు తెస్తానని రాజేష్ నమ్మబలికాడు. దుండగులు అంగీకరించడంతో, అతనిని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, ప్రయాణం మద్యలో ఐతే పల్లె వద్ద కారులో నుంచి రాజేష్ బలవంతంగా దూకేశాడు. ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలైన రాజేష్ అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.బహిరంగ రహదారిపై గాయాలతో ఉండగానే, అక్కడి స్థానికులు అతన్ని గమనించారు.

Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్‌ను ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులను దుండగులు కిడ్నాప్ చేశారని, తాను తప్పించుకున్నానని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.గాయాలు తీవ్రంగా ఉండటంతో పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాజేష్‌ను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా భార్య, పిల్లలను కాపాడండి” అంటూ వేడుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెలుగు చూడనున్నాయి.

AndhraPradesh BreakingNews CrimeNews KidnapCase PoliceInvestigation TirupatiCrime TirupatiNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.