Tirupati : ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ టి. సత్తిరాజును టాస్క్ ఫోర్సు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో ఎఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో, ఢీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన టీమ్ ఆ వ్యక్తి పై నిఘా పెట్టి, స్మగ్లర్లకు సమాచారం ఇస్తున్నట్లు విచారణలో తెలుసుకున్నారు.
Read also: APRTC: అద్దె బస్సు యజమానులతో చర్చలు సఫలం

ఈ వ్యక్తి టాస్క్ ఫోర్సులో హెడ్ కానిస్టేబుల్ (ఏఆర్)గా పని చేస్తూ స్మగ్లర్లకు సమాచార మిస్తున్నట్లు తగిన సాక్ష్యాలతో ధృకీకరించుకుని అరెస్టు చేశారు. ఇతనిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తి స్మగ్లర్ల(Smugglers)కు సమాచారం ఇస్తూ వారి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం అధికారులకు తెలిసింది.
దీంతో అధికారులు విచారించి, అతనిని అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ (SP P. Srinivas) మాట్లాడుతూ తప్పు చేస్తే శాఖాపరంగ కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనుమానాస్పదంగా కనిపించే ఉద్యోగులపైన కూడా నిఘా ఉంటుందని, ఉద్యోగులు నిజాయితీగా వ్యవహరించి తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: