Tirupati District: ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్

Read Time:  1 min
Tirupati District: ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్
FONT SIZE
GET APP

తిరుపతి కలెక్టరేట్ : తిరుపతి జిల్లా (Tirupati District) తిరుచానూరుమార్గంలోని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి అక్బర్, ఎంబీ యూనివర్సిటీ నేత వినోద్ లు మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్ కు గురయ్యారు. ఈ ఇద్దరి విద్యార్థిసంఘాల నాయకులను మోహన్ బాబు యూనివర్సిటీ కి (Mohan Babu University) చెందిన బౌన్సర్లు మార్గమధ్యంలోని కిడ్నాప్ చేసి వారిని సుదూర ప్రాంతంలో బంధించారు. ఈ సంఘటన పెద్దదుమారంతో కలకలం రేపింది.

అసలు విద్యార్థి నేతలను ఎందుకు కిడ్నాప్ చేశారనేది విద్యార్థులకు తెలియక ఆందోళనకు గురయ్యారు. కిడ్నాప్ సంఘటన జరిగిన సంఘటనను విద్యార్థి సంఘాల నేతలు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ మనోహరచారి రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంట వ్యవధిలో కిడ్నాప్ గురైన ఇద్దరు ఎస్ఎఫ్ఎ లీడర్లను రక్షించారు.

Read Also: Jogeswara Rao: ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి

Tirupati District: ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్
Student leaders kidnapped at MB University.

కిడ్నాప్ను ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు

అంతేకాకుండా కిడ్నాప్ చేసిన వారిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. (Tirupati District) కిడ్నాప్ను ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సుబ్బరాయుడు, హామీ ఇచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు చంద్రగిరి పరిధిలోని ఎ. రంగంపేటలో ఎంబియూను నిర్వహిస్తున్నాడు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అందిన ఫిర్యాదులు, వినతులతో న్యాయం కోసం విద్యార్థి సంఘాలు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించే పనిలో కదిలింది. ర్యాలీగా వెళుతున్న ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఎఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోద్పై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వేర్వేరు వాహనాలలో సినిమారీల్ను తలపించేలా ముందుకు ఉరికారు. అక్కడికక్కడే ఇద్దరు నేతల్ని వాహనాల్లో ఎత్తుకెళ్ళారు. దీంతో విద్యార్థులు మరింతగా రెచ్చిపోయారు.

కిడ్నాప్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సిపిఎం నేత కందారపు మురళి వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్కు గురైన విద్యార్థులను కాపాడేందుకు పోలీసు అధికారులను సంప్రదించారు. వెంటనే జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు అదనపు ఎస్పీ రవిమనోహరచారికి ఆదేశాలిచ్చారు. ఆయన వెంటనే బలగాలతో ఎంబియూ ప్రాంతానికి చేరుకుని కిడ్నాప్కు గురైన ఇద్దరు విద్యార్థినేతలను రక్షించి వారి చెర నుండి తీసుకువచ్చారు.

విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబుకు కందారపు మురళి హెచ్చరిక చేశారు. యూనివర్సి టీలో తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని ప్రశ్నించారు. అంతేగాక వెంటనే విద్యార్థులను పోలీసులు కాపాడటంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు చివరకు ఎంబియూ నిర్వాహకులు మోహన్బాబు, విష్ణులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను పలువురు రాజకీయనేతలు, విద్యార్థిసంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.