తిరుపతి(Tirupati) నగరంలో కూటమి ప్రభుత్వం పార్టీలు టి డి పి,జనసేన మధ్య రోడ్డుపైకి చేరిన గొడవలు.ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతములో జరిగిన గొడవలతో ఇప్పటి వరకు అంతర్లీనంగా ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. టిడిపి పై జనసేన నాయకుల గొడవతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. మద్యం మత్తులో ఇరువర్గాలు ఒకరి పై మరొకరు దాడులు చేసుకోవడం తిరుపతి వాసులను ఆందోళనకు గురిచేసింది.
Read Also: AP: అమరావతి రెండో దశ పూలింగ్ ఒకేచోట లేఅవుట్
ఈస్ట్ పోలీస్ స్టేషన్(Tirupati) పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఘటన తో యాత్రికులు కూడా భయంతో పరుగులు తీశారు. ఫ్లెక్సీలు కట్టే క్రమంలో మంజునాథ హోటల్ సిబ్బందికి వెంకటేశ్వర పార్కింగ్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం. వెంకటేశ్వర పార్కింగ్ యజమాని రాజ్ కుమార్ పై సంపత్ రాజు, లక్ష్మీనారాయణ తో పాటు మరో 20 దాడి చేశారంటూ ఫిర్యాదు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ ఎస్ ఐ ప్రసాద్. మంజునాథ హోటల్ వర్కర్ గుత్తి లక్ష్మీనారాయణపై పార్కింగ్ సిబ్బంది 20 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు. ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసిన ఈస్ట్ ఎస్ ఐ ఇమామ్ భాష.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: