हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirupati: ఎఫ్ఐఆర్ తరువాత నిందితుడిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి?

Saritha
Latest news: Tirupati: ఎఫ్ఐఆర్ తరువాత నిందితుడిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి?

పోలీసు అధికారులను విచారణ చేసిన సిఐడి

తిరుపతి : తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్ నెలలో అమెరికన్ డాలర్లు చోరీ కేసుపై ఎఫ్ఐఆర్ చేసినా నిందితుడైన సివి రవికుమార్ ను ఎందుకు అరెస్ట్(Tirupati) చేయలేకపోయారని, ఈ కేసులో నిందితుడిపట్ల ఉదాసీనత చూపాల్సిన అవసరం ఏముందని సిఐడి అధికారులు పూర్వ తిరుమలలో పనిచేసిన ప్రస్తుత విఆర్లో ఉన్న సిఐ జగన్మోహన్రెడ్డిని, ఎస్ఐ లక్ష్మీరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో మీపై ఎవరైనా ఒత్తిడి చేశారా, టిటిడి(TTD) అధికారులు అప్పటి బోర్డు కలుగజేసుకుందా అనే ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. చట్టపరంగా మీకున్న అధికారాలను ఎందుకు ఉపయోగించుకోలేకపోయారని అడిగిన దానికి సమాధానం తీసుకున్నట్లు, ఈ వ్యవహారం మొత్తం పరకామణి కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి బృందం వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. 2023 ఏప్రిల్లో పరకామణిలో గుమస్తాగా ఉన్న సివి రవికుమార్ ఏకంగా 920 విదేశీ డాలర్లు, 11నోట్లు చోరీ చేసిన తరువాత అప్పటి ఏవిఎస్ఐ సతీశకుమార్ ఫిర్యాదుపై ఎలా స్పందించారని వివరాలు సేకరించారు.

Read also: ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ భద్రత కట్టుదిట్టం…

Tirupati
Tirupati

ఎఫ్ఐఆర్ తరువాత అరెస్ట్ చేయకపోవడంపై సిఐడి విచారణ

తదనంతరం ఆధారాలు సేకరించి ఎఫ్ఆర్(Tirupati) చేసిన తరువాత చట్టప్రకారం నిందితుడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదనేది కీలకంగా వివరాలు రాబట్టడం విశేషం. పూర్తిస్థాయిలో ఆధారాలు ఎందుకు సేకరించలేకపోయారని, నిందితుడి నుండి సమగ్ర కేసు వివరాలు రాబట్టలేకపోవడం వెనుక ఆంతర్యమేమని ప్రశ్నించడం తెలుస్తోంది. అయితే ఏవిఎస్ ఈ కేసులో ఫిర్యాదిదారుడు కావడంతో టిటిడి నిబంధనల మేరకు కేసులో మధ్యవర్తిత్వం జరిపి రాజీచేసుకునే పరిస్థితులు వివరించారని వెల్లడించినట్లు సమాచారం. చివరకు మూడునెలల్లోనే లోక్అదాలత్లో కేసు రాజీ చేసుకున్నారని ఈ తతంగం మొత్తం టిటిడి అధికారుల నుండి ఏవిఎస్ వివరణమేరకు జరిగిందని పోలీస్ అధికారులు వివరించినట్లు తెలిసింది. పూర్వ టిటిడి విజిఒగా పనిచేసిన ప్రస్తుత డిఎస్పీ గిరిధర్ కూడా ఈ కేసులో కేవలం నిమిత్తమాత్రులమేనని, టిటిడిలో ఉన్నతాధికారులు, బోర్డు కీలకమని సిఐడి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎవరికీ దురుద్దేశ్యం లేదని, టిటిడి అధికారుల సూచనల మేరకు అన్ని జరిగాయని పోలీస్ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు టిటిడి పూర్వ అధికారులను విచారణకు పిలుస్తారా లేక మళ్ళీ నిందితుడు రవికుమార్కు సంబంధించి పూర్తి వివరాలు సిఐడి బృందం దర్యాప్తు చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించేందుకు త్వరత్వరగా ముందుకు కదులుతోంది. ఈ కేసులో గత పోలీస్ అధికారులను సిఐడి విచారణ చేయడంతో టిటిడిలో ఉలిక్కిపడుతున్నారు. రవికుమార్ ఆస్తుల వివరాలను సిఐడి సేకరించే పనిలో నిమగ్నమైంది. గత టిటిడి బోర్డు సభ్యులు, గత టిటిడి అధికారుల గుండెల్లో భయం పట్టుకుందని తెలుస్తోంది. రవికుమార్ పరకామణిలో ఎంతకాలంగా ఇలా విదేశీ కరెన్సీ దొంగతనం చేశాడనేది పోలీసులు సమగ్రంగా విచారణ చేయలేదనేది సిఐడి బృందం తేల్చిన ప్రధాన అంశం.

14న తిరుపతిలో కార్తీకదీపోత్సవం

తిరుమల : పవిత్రమైన కార్తీకమాసంలో తిరుపతిలో 14వతేదీ శుక్రవారం కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నారు. టిటిడి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కార్తీకదీపోత్స వాలను మహిళా భక్తులతో జరిపించడం పరిపాటి. ఈ ఏడాది శుక్రవారం ఈ కార్యక్రమానికి టిటిడి పరిపాలన భవనం మైదానాన్ని సిద్ధం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870