📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chandragiri RTC Bus Accident: టాటా ఏసీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Author Icon By Siva Prasad
Updated: February 19, 2026 • 10:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chandragiri RTC Bus Accident: తిరుపతి-చిత్తూరు హైవేపై చంద్రగిరి మండలం ఇరంగారిపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని, ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏసీ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం

ప్రమాదం జరిగిన తీరు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పి.చంద్రయ్య తిరుపతి నుండి పాకాలకు వెళ్తుండగా, మార్గమధ్యంలో నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ధ్వంసమైన టాటా ఏసీ వాహనం ఇరంగారిపల్లికి చెందిన బి.మునికృష్ణదిగా పోలీసులు గుర్తించారు. బస్సు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Chandragiri RTC Bus Accident: RTC bus collides with Tata AC

Chandragiri RTC Bus Accident: పోలీసుల దర్యాప్తు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పాకాల ఎస్.ఐ తరుణ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన వాహనాలను పరిశీలించి, హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Chandragiri Road Accident Irangaripalli News Pakala Police Station RTC bus accident Tirupati Chittoor Highway

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.