రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్
New Train: రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ తిరుపతి నుంచి నైరుతి రైల్వే మైసూరు డివిజన్ చిక్కమగళూరు మద్య కొత్త రైలు (New Train) సర్వీసులను నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల మద్యత్వరలో ప్రారంభం కాబోతున్న ఈ రైళ్ల నిర్వహణకు సంబంధించి రైల్వే బోర్డు కోచింగ్ విభాగం సంయుక్త సంచాలకులు వివేక్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి (Tirupati) నుంచి చిక్కమగళూరు (Chikmagalur)వెళ్లే నెంబర్ 17423 వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం రాత్రి 9గంటలకు తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.30గంటలకు చిక్కమగళూరు చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో చిక్కమగళూరు నుంచి తిరుపతి వెళ్లే నెంబర్ 17424వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు చిక్కమగళూరు నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 7గంటలకు తిరుపతి చేరుకుంటుంది. త్వరలో పట్టాలెక్క బోతున్న ఈ రైళ్లు మార్గమధ్యంలో పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, కుప్పం, బం గారుపేట, వైట్ ఫీల్డ్, క్రిష్ణారాజాపురం, బెంగళూరు, చిక్భన్వరా, తుముకూరు, తిప్తూరు, అరిసికెర, దేవనూరు, బిరూర్, కడూర్, బసిలే హళ్లి, సకరాయపట్టణం స్టేషన్లలో నిలుస్తాయి.
Read also: AP: ఎపిలో రానున్న సాంకేతిక అద్భుతాలు