📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Tirupati: ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య

Author Icon By Rajitha
Updated: January 28, 2026 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నారాయణవనం(తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా పుత్తూరు సమీపం నారాయణవనం మండలం పరిధి సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం (ఇఇఇ) బిటెక్ చదువుతున్న ప్రదీప్ కుమార్ (19) ఓ ప్రవేటు హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యకు (suiside) సంబందించి వివరాలు ఇలా వున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కృష్ణమూర్తి కుమారుడు ప్రదీప్ కుమార్ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్ కుమార్ కళాశాలకు సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్ మొదటి అంతస్తులోని ఓ గదిలోని సహా విద్యార్థులతో కలిసి వుంటూ చదువుకుంటున్నాడు.

Read also: AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ

engineering student committed suicide in his hostel room

విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో

అయితే మంగళవారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోనే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ప్రదీప్ కుమార్ కళాశాలకు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫోన్ తీయకపోవడంతో మధ్యాహ్నం 3గంటలకు హాస్టల్ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని వుండడంతో హాస్టల్ నిర్వాహకులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం స్థానిక ఎస్ఐ శ్రీనివాసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్ఐ మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లితండ్రులకు సమాచారం అందించి, విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో పుత్తూరు రూరల్ సిఐ రవీంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Engineering Student latest news Student suicide Telugu News Tirupati News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.