Tirumala : శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ (TTD Good News) చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవ స్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఎఐ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనం 1,2 గంటల్లోగా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే తిరుమలలో కొత్త క్యాంటీన్లు, శ్రీవాణి దర్శనం వేళల మార్పు, విఐపి దర్శన సమయం గురించి హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త వినిపించింది. తిరుమలలో ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీనివాసుడి దర్శనంకోసం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అయితే విశేష పర్వదినాలు, ఉత్సవాలు, పండుగల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో ఇలాంటి రోజులలో శ్రీవారి దర్శనానికి గంటలు గంటలు సమయం పడుతోంది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టిటిడి సరికొత్త ఆలోచన చేస్తోంది. దేవదేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.
టిటిడి కీలక నిర్ణయాలు: భక్తులకు వేగవంతమైన దర్శనం
ఆర్టిఫిషియల్అంటెలిజెన్స్ సాయంతో గంటనుంచి రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే తిరుమలలో త్వరలోనే కొత్త క్యాంటీన్లను ప్రారంభిస్తా మని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టిటిడిలో పనిచేసే అన్యమత సిబ్బందిని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాంటి వారిని స్వచ్చంద పదవీ విరమణ పథకం కింద పంపించేలా ప్రణాళికలురచిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే సిబ్బంది ఎవరైనా అన్యమత ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. మరోవైపు తిరుమలలో శ్రీవాణి టికెట్ల దర్శన (Srivani tickets viewing) సమయాలు మారుస్తామన్న టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు.. ఉదయం శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు సాయంత్రాని కల్లా శ్రీవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తు న్నట్లు వివరించారు. అలాగే తిరుమలలో విఐపి దర్శనాలను ఉదయం 8 నుంచి 8.30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :