తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.
Read Also: CBN Focus: పెద్ద పెట్టుబడుల కోసం AP ప్రభుత్వం కొత్త వ్యూహం
ఆన్‌లైన్ కోటా విడుదల
అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు కూడా వైకుంఠ ద్వార దర్శనం (రూ.300 టికెట్లతో మహా లభు దర్శనం) కల్పిస్తారు.. వారికి దర్శనం, వసతి గదులు ఈ నెల 5న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు శ్రీవాణి టికెట్లు దర్శనం టికెట్లు, వసతి గదుల్ని టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: