📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: Tirumala: మూడురోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే ‘వైకుంఠ’దర్శన టోకెన్లు జారీ

Author Icon By Saritha
Updated: November 26, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేపటి నుండి ఆన్లైన్లో నమోదుకు అవకాశం – జనవరి 2 నుండి 8 వరకు

తిరుమల : కలియుగవైకుంఠం తిరుమల ఆలయంలో(Tirumala) పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే టిటిడి(TTD) టోకెన్లు జారీచేస్తుంది. డిసెంబర్ 30,31, 2026 జనవరి 1వతేదీ దర్శన టోకెన్ల కోసం ఈనెల 27వతేదీ (రేపు) గురువారం నుండి ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 1వతేదీ వరకు అవకాశం కల్పించింది. జనవరి 2వతేదీ నుండి 8వరకు పూర్తిగా ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేకున్నా సాధారణ సర్వదర్శనంలో వైకుంఠమ్ 2క్యూకాంప్లెక్స్ నుండి భక్తులను అనుమతించి వైకుంఠమార్గం దర్శనం చేయిస్తారు. డిసెంబర్ 30వతేదీ నుండి జనవరి 8వరకు పదిరోజులు పూర్తిగా ఆఫ్లైన్ ఎస్ఎస్ టోకెన్లు జారీని నిలుపుదలచేశారు. ఆన్లైన్లో కుటుంబసభ్యులకు 1+3 విధానంలో టోకెన్లు నమోదు చేసుకోవడానికి టిటిడి అవకాశం కల్పించింది.

Read also: రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు ఆందోళన..

‘Vaikuntha’ Darshan tokens issued through electronic dip for three days

రేపటి నుండి ఆన్లైన్లో డిప్ నమోదు:

మొదటిమూడురోజుల వైకుంఠద్వార(Tirumala) దర్శనాలకు సంబంధించి ఈనెల 27వతేదీ ఉదయం 10గంటల నుండి డిసెంబర్ 1వతేదీ సాయంత్రం 5గంటల వరకు టిటిడి వెబ్సైట్ హెచ్ టిటిపిఎస్://టిటిదేవస్థానమ్స్. ఎపి. జిఒవి, ఇ న్//, మొబైల్ యాప్ యాప్స్. ఆపిల్.కామ్ /ఇన్/యాప్/టిటిదేవస్థానమ్స్, వాట్సాప్లో ఏపి ప్రభుత్వబాట్లో టిటిడి ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వతేదీ మధ్యాహ్నం 2గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి. వాట్సా ప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపి గవర్నమెంట్ సర్వీసెస్ 9552300009కు ముందుగా గోవింద, హాయఅని మెసేజ్ చేయాలి. ఆ తరువాత ఆంగ్లం, తెలుగుభాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం ఇన్ అని, తెలుగుకోసం టిఇ అని జవాబివ్వాలి. అనంతరం డిసెంబర్ 30,31,జనవరి 1వతేదీల్లో దర్శనం కావాల్సిన రోజును లేదా మూడురోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తరువాత భక్తులు ఆధార్కార్డులో ఉన్న మేరకు పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబరు నమోదు చేయాలి. వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మొదటి మూడురోజులు ఎస్ డి శ్రీవాణి రద్దు: వైకుంఠద్వార దర్శనాల్లో మొదటి మూడురోజులు డిసెంబర్ 30,31, జనవరి 1తేదీల్లో ఎస్డి, శ్రీవాణి,ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. జనవరి 2నుండి 8వరకు ఎస్డి, శ్రీవాణి ఆన్లైన్లో జారీచేస్తారు. కాగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వైకుంఠద్వార దర్శనాలు కల్పిస్తారు. ఎలాంటి సిఫార్సు లేఖలు. స్వీకరించారు.

ఆన్లైన్ ద్వారా దాతలకు దర్శనాలు:

కోటిరూపాయలు ఆపై విరాళమిచ్చిన దాతలకు వారి కుటంబసభ్యులకు డిసెంబర్ 30నుండి జనవరి 8వరకు రోజుకు 125మందికి, లక్షరూపాయల నుండి 99 లక్షలు రూపాయల వరకు విరాళం డిసెంబర్ 30,312 ఇచ్చినదాతలకు వెయ్యిమందికి జనవరి 1నుండి 8వరకు రోజుకు రెండువేల మందికి దర్శనం కల్పించనున్నారు. వీరు కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్లో డిసెంబర్ 5వతేదీ విడుదల చేస్తారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Andhra Pradesh Electronic Dip Latest News in Telugu Online Registration Pilgrimage temple visit tirumala TTD Token Vaikunta Darsanam vaikunta ekadasi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.