Latest news: Tirumala: వడ్డీకాసుల వెంకన్నకు వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం

Read Time:  1 min
Tirumala
Tirumala
FONT SIZE
GET APP

తిరుమల : వడ్డీకాసుల వేంకటేశ్వర స్వామికి (Tirumala) ప్రియభక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం బహుకరించారు. నీలోఫర్కేఫ్ యజమాని బాబురావు కుటుంబం గతంలో తిరుమలకు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్న సమయంలో సాక్షాత్తు స్వామివారే తనకు యజ్ఞోపవీతం కావాలని కోరినట్లు మనసులో తోచింది.

Read also: ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు

Tirumala
The owner of Nilofar Cafe presented a gold Yajnopaveet studded with diamonds.

భక్తుడి కోరికతో సమర్పించిన విరాళం

దీంతో దాదాపు కిలో బంగారం(Gold) కోటి రూపాయలు వజ్రాలతో తయారుచేయించిన ఈ అమూల్యమైన విరాళం యజ్ఞోపవీతాన్ని (Tirumala) బాబురావు కుటుంబం టిటిడికి అందజేసింది. గతంలో దర్శనానికి వచ్చినపుడు స్వామివారు అడగటం తన భక్తితో ఆ దేవునికి ఇప్పు డు సమర్పించుకోవడం జరిగిందని దాత తెలిపారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని అందుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.