📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: తిరుమలలో విషాదం.. భక్తురాలిని కాటేసిన పాము

Author Icon By Saritha
Updated: February 23, 2026 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు వేసింది. తెలంగాణకు చెందిన మౌనికగా బాధితురాలి గుర్తింపు ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని (Telangana) భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది.

Read Also: World Twins Day 2026: ఒకేచోట వందమంది కవలలు

Tirumala: Tragedy in Tirumala.. Snake bites devotee

ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారాన్ని ఆమె కుటుంబసభ్యులకు అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Telangana Devotee Monica Telugu News Tirumala latest news Tirumala Snake Bite Tirupati SVIMS Hospital TTD News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.