తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈ సంవత్సరం డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా, జనవరి 6, 7, 8వ తేదీల్లో తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల స్థానికులకు రోజుకు 5,000 టోకెన్ల కేటాయింపు చేపట్టనున్నారు. స్థానిక భక్తులు 1+3 విధానం ద్వారా ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. దీని కోసం టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు వాట్సాప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 25 ఉదయం 10 నుండి 27 సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు కేటాయించబడతాయి. ఇందులో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు కేటాయించనున్నారు.
Read Also: టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన స్వామీజీ
మంత్రాలయం నుండి తిరుమలకు విచ్చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేేంద్ర తీర్థ స్వామీజీ, టీటీడీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని(Tirumala) పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, భక్తులకు తక్షణమే సేవలందించడానికి ఉపయోగిస్తున్న సాంకేతికతను ప్రశంసించారు. తర్వాత, స్వామీజీ PAC-5 యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించి, భక్తుల కోసం టీటీడీ(TTD) రూపొందిస్తున్న సౌకర్యాలను అభినందించారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కూడా భక్తుల సౌకర్యానికి తీసుకుంటున్న చర్యలకు స్వీకార తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా, మంత్రాలయం కూడా ఈ విధానాలను అనుసరించి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు స్వామీజీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: