📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Tirumala – శ్రీవాణి ఆఫ్లైన్ జారీ కొనసాగింపునకు తర్జనభర్జనలు!

Author Icon By Shravan
Updated: August 26, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని (Lord Venkateswara Swamy) ఆలయంలో మరీ దగ్గరగా కులశేఖరపడి (మొదటి గడప) వద్దనుండి దర్శనం చేసుకునే అవకాశం ఉన్న శ్రీవాణిబ్రేక్ దర్శనాల టిక్కెట్లు ఆన్లైన్లో జారీ కొనసాగింపు విషయంలో టిటిడి ఎటూ తేల్చుకోలేకపోతోంది. భక్తుల నుండి డిమాండ్ విపరీతంగా ఉండటంతో ఈ టిక్కెట్లు తిరుమలలోని అన్నమయ్యభవనం సమీపంలో శ్రీవాణి ప్రత్యేక కౌంటర్ల వద్ద సమయం, సందర్భం లేకుండా జారీచేయడమే ప్రధానంగా భక్తుల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణీతసమయం ప్రకారం ప్రతి రోజూ ఉదయం 10గంటలకు ఈ ప్రత్యేక కౌంటర్ల వద్ద టిక్కెట్లు జారీచేయాల్సి ఉంది. ఇందుకు భక్తులు వేకువజామున 3,4గంటల నుండే అక్కడ క్యూలైన్లో బారులుతీరి నిలబడుతున్నారు.

తిరుమల శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లకు భారీ డిమాండ్

రోజువారీగా తిరుమలలోని కౌంటర్లలో 800 శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు (Srivani Break Darshan Tickets) రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు పొందిన భక్తులకు ఏరోజుకారోజు దర్శనం కావడంతో సాయంత్రం 4.30గంటలకు ఆలయంలోనికి వైకుంఠమ్ 1 క్యూలైన్ల నుండి అనుమతినిస్తున్నారు. దీనివల్ల డబ్బున్న ధనవంతులేగాక సామాన్యభక్తులు కూడా దర్శనం త్వరగా వీలుకల్పించారు. ఈ నేపథ్యంలో సాధారణరోజుల్లోనూ మధ్యాహ్నం 12గంటలలోపే శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు పూర్తిగా జారీ అవుతున్నాయి. ఇంకా వారాంతం, రద్దీ విపరీతంగా ఉండే రోజుల్లో మరీ అర్థరాత్రి వేళ టిక్కెట్లు చేసుకునేందుకు జారీచేస్తుండటంతో ఉదయం 6గంటలకల్లా ఆరోజు దర్శన టిక్కెట్లు పూర్తిగా కోటా లేకపోతోంది.

తిరుమల శ్రీవాణి టిక్కెట్ల జారీ విధానంలో మార్పు: భక్తులకు మరింత సౌలభ్యం

టిక్కెట్లు జారీచేసే విషయంపై గతవారం తిరుమలలో భక్తులు రచ్చచేయడం, నిరసనలకు దిగడం జరిగింది. దీంతో శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆన్లైన్లో రోజువారీగా 500 టిక్కెట్లు మూడునెలలముందే విడుదల చేస్తుండటం, ఈ టిక్కెట్లు అందుకున్న భక్తులు కొన్ని అనివార్యకారణాలతో దర్శనాలకు రాలేకపోతున్నారనేది టిటిడి సమాచారం. అలాంటి సమయంలో ఆ టిక్కెట్లు వృథాగానే పోతున్నాయి. దీనివల్ల ఆన్లైన్లోనే జారీచేయడం వల్ల కొండకు చేరుకున్న భక్తులు తమతమ స్థాయిని బట్టి ముందువచ్చిన వారికి ముందు అనే విధంగా ఏరోజుకారోజు టిక్కెట్లు అందుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. అంతేగాక ఆన్లైన్లో టిక్కెట్లు పొందిన భక్తులు తిరుమలలోనే స్థానిక ఆలయాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించే వీలుకూడా ఉంది. గదులకోసం తంటాలు తప్పుతాయి. మరీ ఎవరైనా భక్తులు సెంటిమెంట్గా భావిస్తే యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవడం చేయవచ్చు. ఇవన్నీ పరిగణనలోనికి తీసుకుంటున్న టిటిడి అధికారులు ఆన్లైన్లోనే శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు కొనసాగించడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Tirumala – శ్రీవాణి ఆఫ్లైన్ జారీ కొనసాగింపునకు తర్జనభర్జనలు!

శ్రీవాణి టిక్కెట్ల లభ్యతపై డిజిటల్ డిస్ప్లే – భక్తుల విజ్ఞప్తులపై టిటిడి సమీక్ష

ఈ టిక్కెట్లు జారీ కౌంటర్ల వద్ద పూర్తి పారదర్శకంగా డిజిటల్ డిస్ప్లే చేస్తూ ఎన్ని టిక్కెట్లు లభ్యత వున్నాయనే సమాచారం తెలియజేస్తున్నారు. సోమవారం భక్తుల రద్దీ ఓ మాదిరిగా కొనసాగడంతో మధ్యాహ్నం 1గంటకు 80వరకు శ్రీవాణి బ్రేక్ టిక్కెట్లు ఉన్నాయి. గంటసమయంలో ఆ టిక్కెట్లను భక్తులు బుక్చేసుకుని సాయంత్రం దర్శనానికి వెళ్ళడం విశేషం. ప్రతిరోజూ 1,500 టిక్కెట్లు జారీ అవుతున్న శ్రీవాణి మరో 500వరకు పెంచాలని భక్తుల నుండి వస్తున్న విజప్తి. మరీ దీనిపై టిటిడి అధికారులు సమగ్రంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. మరీ టిక్కెట్లు 300వరకు పెంచాలనే యోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నారనేది సమాచారం. అయితే 10,500 రూపాయలు చెల్లించి దర్శన టిక్కెట్ పోందుతున్న భక్తులకు వసతి సదుపాయం విషయంలో కూడా కుదరదనే అంశంపై భక్తులకు అవగాహన కల్పించాలని ఆలోచన చేస్తున్నారు. మరీ వారంరోజుల్లో ఈ అంశాలపై టిటిడి అధికారులు ఒకస్పష్టతకు రానున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/ap-handlooms-10-awards-for-ap-handlooms-at-the-national-level/andhra-pradesh/536228/

Breaking News in Telugu Latest News in Telugu Offline Tickets SreeVani Scheme Telugu News Paper Ticket Booking Tirumala News Tirupati News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.