📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Tirumala: కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టిటిడి మాజీ అధికారులకు విచారణ తాఖీదులు

తిరుమల : తిరుమల లడ్డూల తయారీకి 2020-24 మధ్య కాలంలో కల్తీనెయ్యి సరఫరా కేసులో ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని సిట్ సుప్రీంకోర్టుకు(Tirumala) అందజేయనుందనేది తెలుస్తోంది. మంగళవారం టిటిడి(TTD) బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో టిటిడిలో మార్కెటింగ్, కొనుగోళ్ళ విభాగాలకు చెందిన కొందరు మాజీ అధికారులను సిట్ విచారణకు రమ్మని తాఖీదులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కల్తీనెయ్యి కేసులో 16న కొంత సమాచారంతో సుప్రీం న్యాయ స్థానంకు వెళితే తదుపరి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనేది తెలియాలి. 2020 ఆగస్ట్లోనే తిరుమలకు కల్తీనెయ్యి సరఫరా అవుతోందని అప్పట్లోనే గుర్తించిన టిటిడి మార్కెటింగ్, కొనుగోళ్ళ విభాగం అధికారులు బోర్డుకు తెలిపినా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పెద్దగా పట్టించుకోలేదనేది సిట్ కస్టడీ లోని మాజీ జిఎం సుబ్రమణ్యం వాంగ్మూలం.

Read also: పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

Tirumala The ‘SIT’ is expected to approach the Supreme Court tomorrow in the adulterated ghee case.

కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ విచారణ

ఇంకా పలు సంచలన విషయాలు సిట్ అధికారులకు(Tirumala) సుబ్రమణ్యం తెలియజేయడంతో ఇప్పుడు టిటిడి వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కల్తీనెయ్యి కేసులో భాగస్వాములైన గత అధికారులు 12మందిని గుర్తించిన సిట్ వారిని విచారణకు పిలిచేందుకు టిటిడి ఇఒకు లేఖ రాయడం, దానిపై 16న ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే ఆ 12మందిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. వీరిలో ముగ్గురు అధికారులు ఇప్పటికే పదవీవిరమణ చేశారు. ఉద్యోగులను విచారణకు ఇఒ అనుమతి అసవరం. నాగేంద్రప్రసాద్, శేఖర్, ఈశ్వర్రెడ్డి, వెంకట అనిల్ కుమార్, వెంకట నగేశ్ బాబు, జగదీశ్వర్ రెడ్డి, సుబ్రమణ్యం, మురళీకృష్ణ, గోశాల మాజీ డైరెక్టర్ (సస్పెన్షన్ వేటుకు గురైన) డాక్టర్ హరినాధ రెడ్డి కల్తీనెయ్యిలో కీలకమనేది సిట్ కథనం. కీలకమైన ఐదుగురు టిటిడి ఉద్యోగులను విచారణ చేస్తే నెలకొన్న చిక్కుముడి వీడి పోతుందనేది వినిపిస్తున్న వ్యాఖ్యలు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Latest News in Telugu SIT Probe Supreme Court Update Telugu News tirumala laddu controversy TTD Adulterated Ghee Case TTD Officials Investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.