📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Tirumala: టీటీడీలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత

Author Icon By Saritha
Updated: January 22, 2026 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రథ సప్తమి సందర్భంగా తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. రథ సప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారికి ఆయన సూచించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా స్వామివారి ప్రత్యేక సేవలు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు, సహస్ర దీపకలంకారాలు రద్దు చేశారు. ఎన్‌ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రివిలేజ్ దర్శనాలు నిలిపివేయబడ్డాయి. VIP బ్రేక్ దర్శనాలు మినహా, జనవరి 24న అన్ని సిఫార్సులు స్వీకరించబోమని టీటీడీ తెలిపారు.

Read also: AP: నగరి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

The issuance of Sarva Darshan tokens has been suspended at TTD.

ఏఏ సేవలు..ఎప్పుడెప్పుడంటే?

తెల్లవారుజామున 5:30 నుంచి 8:00 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8:00 నుంచి 9:00 గంటల వరకు చంద్రప్రభ వాహనం

ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఈరోజు (Tirumala) ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయం 10:00 గంటలకు ఆర్జిత సేవ, మధ్యాహ్నం 3:00 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Darshan tokens suspension Latest News in Telugu RathaSaptami special services cancellation Telugu News Tirumala Tirupati Devasthanams tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.