📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala Srivari Teppotsavam 2026: శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Author Icon By Siva Prasad
Updated: February 26, 2026 • 11:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Srivari Teppotsavam 2026: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ “తెప్ప తిరునాళ్లు” వేడుకల్లో భాగంగా తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.

Read Also: AP Housing Scheme: సొంతింటి కల సాకారం.. ఉగాదికి ఏపీలో కొత్త ఇళ్ల పండుగ

పుష్కరిణిలో మూడు చుట్లు..

ముందుగా సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా సాగి పుష్కరిణి వద్దకు చేరుకుంది. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు అధిరోహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Tirumala Srivari Teppotsavam 2026: తెప్పోత్సవాల చరిత్ర – విశిష్టత

తిరుమల తెప్పోత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీ.శ. 1468లో శ్రీ సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి ఈ ఉత్సవాలకు పునాది వేశారు. 15వ శతాబ్దంలో అన్నమయ్య ఈ వేడుకలను తన కీర్తనలతో కొనియాడారు. మధ్యలో కొంతకాలం ఆగిపోయిన ఈ ఉత్సవాలను 1921లో తిరిగి పునరుద్ధరించారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Lord Rama Teppotsavam Saliwa Narasimha Rayalu Srivari Pushkarini tirumala news today Tirumala Srivari Teppotsavam 2026 Tirumala Teppotsavam 2026 Tirupati Updates TTD Chairman B.R. Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.