Tirumala: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Read Time:  1 min
Tirumala: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
FONT SIZE
GET APP

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సిద్ధమైంది. స్వామివారి పుష్కరిణిలో ఐదు రోజుల పాటు వైభవంగా సాగే ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Read Also: Tirumala Ghat Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

Tirumala: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala: Srivari Salakatla float festival begins today

ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తెప్పోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్ప అలంకరణలతో పుష్కరిణి పరిసరాలు ధగధగలాడుతున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు మార్చి 2వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కనువిందు చేయనున్నాయి. పుష్కరిణి మధ్యలో స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.