Tirumala : శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavams) సిద్ధమవుతోంది. ఈ ఏడాది జరగనున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల కార్యాచరణను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారుచేసింది. ఈ ఏడాది ఒక బ్రహ్మోత్సవం మాత్రమే నిర్వహిస్తారు. వాహనసేవలను ఆలయమాఢవీధుల్లో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంపై, భక్తులకు ఇబ్బంది లేకుండా వాహన సేవలవీక్షణకు సౌకర్యాల కల్పనపై అన్నమయ్యభవనంలో ఇప్పటికే టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి అధ్యక్షతన ప్రాధమిక సమీక్ష నిర్వహిం చారు. సెప్టెంబర్ 24వతేదీ నుంచి అక్టోబర్ 2వరకు సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ హించేందుకు ముహూర్తం ఖరారుచేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ విష యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను వైభవంగా విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేపడుతామన్నారు.
ఈ ఏడాది కూడా పెద్దసంఖ్యలో భక్తులు (Devotees in large numbers) విచ్చేసే అవకాశముందని, ఇందుకు అనుగుణంగా పటిష్టంగా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనాలు రద్దు చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ కు భక్తులు అశేషసంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతారు. సామాన్యభక్తులకు ఎక్కువగా దర్శనసమయం కల్పించేందుకు తొమ్మిదిరోజులు బ్రేక్ దర్శనాలు రద్దుచేశారు. ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు మంజూరుచేస్తారు.
సెప్టెంబర్ 24న సిఎం పట్టువస్త్రాలు:
ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలయ్యే తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తొలిరోజు సెప్టెంబర్ 24వతేదీన ధ్వజారోహణంరోజునే రాష్ట్ర ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు రాష్ట్రప్రభు త్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 24వతేదీ రాత్రి తొలివాహనంగా పెద్దశేషవాహనం, సెప్టెంబర్ 28 గరుడసేవ, 31న స్వర్ణరథం, 1వతేదీ రధో త్సవం, 2న చక్రస్నానం జరుగుతాయి. పోలీసుల తో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పించేలా చూడనున్నారు. బ్రహ్మో త్సవాల సమయంలో తిరుమలలో మాఢవీ ధుల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేసి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :