📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: శ్రీరంగం నుండి తిరుమలేశునికి పట్టువస్త్రాలు

Author Icon By Sharanya
Updated: July 17, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: తమిళులకు అత్యంత పవిత్రమైన ఆణివార ఆస్థానంరోజు తమిళనాడు శ్రీరంగంలోని ప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీరంగనాధస్వామి నుండి తిరుమలేశునికి పట్టు వస్త్రాలు చేరాయి. బుధవారం ఉదయం ఈ పట్టువస్త్రాలను సాంప్రదాయంగా తమిళనాడు (Tamil Nadu) దేవాదాయశాఖ కార్యదర్శి శ్రీధరన్, దేవదాయశాఖ అదనపు కార్యదర్శి మణివాసగం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామ్కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు సుందరబట్టర్ ఈ పట్టువస్త్రాలను, పండ్లు, పూలు, చందనం, కుంకుమ తదితర వాటిని తొలుత తిరుమల (Tirumala) లోని పెద్దజీయంగారి మఠం వద్దకు తీసుకువచ్చారు.

ఇక్కడ పెద్దజీయచ్, చిన్నజీయర్ స్వామి వాటిని స్వీకరించారు. టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు (Chairman B.R. Naidu) దంపతులు, టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు అలంకరించారు .

శ్రీరంగం నుండి పట్టువస్త్రాలు ఎక్కడికి పంపించారు?


శ్రీరంగం నుండి తమిళనాడులోని ప్రాచీన రామానుజాచార్యుల సంప్రదాయాలను అనుసరించే దేవస్థానం, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి (తిరుమలేశునికి) పట్టువస్త్రాలు పంపించింది.

ఈ ఆచారం ఎప్పటి నుండి కొనసాగుతోంది?


శ్రీరంగం నుండి తిరుమలేశునికి పట్టువస్త్రాలు పంపించే ఆచారం చాలా పురాతనమైనది. ఇది దశాబ్దాలుగా లేదా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆలయ పరస్పర బంధం ఆధారంగా జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: TTD: 19న అక్టోబర్ నెల ఆర్జితసేవల టిక్కెట్లు విడుదల

Minister Farooq: మైనారిటీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి – మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్



Breaking News latest news Lord Venkateswara Silk Vastrams Srirangam Temple Telugu News TTD News Vaishnavite Rituals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.