Tirumala brahmotsavam 2025 : దేదీప్యమానంగా వెలిగిపోతున్న తిరుమల – శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ కాంతుల కనువిందు టీటీడీ తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విద్యుత్ దీపాలు, పుష్పాలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించింది. (Tirumala brahmotsavam 2025) ఆలయం దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠ అనుభూతి కలిగేలా తీర్చిదిద్దారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ఆలయాన్ని దేవలోకంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల అవతారాలు, రంగుల జ్యోతి విరజిమ్మించే విద్యుత్ దీపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ఏడు కొండలపై వెలసిన ఆలయ మహా గోపురంతో పాటు తిరుమలలోని ఇతర ప్రాంతాలు కూడా విద్యుత్ దీపాలంకరణ ద్వారా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమల కొండను శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శోభాయమానంగా తీర్చిదిద్దింది టీటీడీ. శ్రీవారి వాహన సేవలు, మూలమూర్తి దర్శనార్థం వచ్చిన భక్తులు నిజంగా వైకుంఠంలోకి ప్రవేశించినట్లే అనిపించేలా ఈ అలంకరణలు రూపొందించబడ్డాయి.
వివిధ రకాల అరుదైన పుష్పాలు, పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీవారి ఆలయ మహా గోపురం నుండి ఆలయం లోపల వరకు, వివిధ వర్ణాల విద్యుత్ దీపాలు వెలిగించి, భక్తులను మంత్రముగ్ధులుగా చేసింది.
Read also :