📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Tirumala: ఈ నెల 21న ఐదేళ్ల లోపు పిల్లల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

Author Icon By Saritha
Updated: December 19, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో భక్తుల సందడి నిరంతరం కొనసాగుతోంది. (Tirumala)నిత్యం వేలాదిగా భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. బుధవారం ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి హాజరుకావడం విశేషంగా నిలిచింది. బుధవారం నాడు మొత్తం 66,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో దాదాపు 24,956 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజున హుండీ ఆదాయంగా రూ.3.81 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి లభించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన సర్వదర్శనం భక్తులకు దర్శనం పొందేందుకు సుమారు 10 నుంచి 12 గంటల వరకు వేచిచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూలైన్లు మరియు కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు.

Read Also: Pawan Kalyan: భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు

ఇదిలా ఉండగా, ఈ నెల 21వ తేదీన జరగనున్న దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (Tirumala) ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, పాపవినాశనం, సుపథం, బాలాజీ నగర్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపలతో పాటు పలు ప్రాంతాల్లో పల్స్ పోలియో(Pulse Polio) కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు డిసెంబర్ 20న అవగాహన ర్యాలీతో పాటు జీపు ప్రకటనల ద్వారా భక్తులు, స్థానికులకు సమాచారం అందించనున్నారు. ఈ చర్యలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Devotees Latest News in Telugu PulsePolio Telugu News TempleNews tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.