భక్తుల భద్రతకు ప్రాధాన్యత : ఎస్పీ సుబ్బరాయుడు
తిరుమల : కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి(Tirumala) జరిగిన బ్రహ్మోత్సవాలను విజయ వంతంగా నిర్వహించడం వెనుక పోలీసుశాఖ నుండి సహకారం అందించినట్లే రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సేవలందించాలని తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు సూచించారు. ఆ రెండు రోజులతో బాటు జనవరి 1న కూడా భక్తులు అశేషంగా తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున భద్రత పరంగా, భక్తులకు సేవలందించే విషయాలపై సోమవారం సాయంత్రం తిరుపతిలో పోలీస్ అధికారులతో సమీక్షించారు.
Read also: ఐఏఎస్ ఆమ్రపాలిపై క్యాట్ ఉత్తర్వులపై హై-కోర్టు స్టే
భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
తిరుపతి అదనపు ఎస్పీలు(Tirumala) రవిమనోహరచారి, రామకృష్ణ, నాగసుబ్బన్న, కులశేఖర్, ఎస్బి డిఎస్పీ జె. వెంకటనారాయణ, డిఎస్పీలు విజయశేఖర్, భక్తవత్సలం, శ్యామసుందర్, రామకృష్ణమాచారిలతో కలసి ఎస్పీ సుబ్బరాయుడు సమావేశం నిర్వహించారు. వైకుంఠద్వార దర్శనాల కారణంగా తిరుమలలో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలోపెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ స్థలాలు, క్యూలైన్ల నియంత్రణ, చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్ప్ డెస్క్లు, ప్రత్యేక టీమ్లు విజిలెన్స్ సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో క్విక్ఇస్పాన్స్టిమ్స్, వైద్యసిబ్బంది(Medical professional)సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: