📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Tirumala: భక్తుల ఇబ్బందులపై రియల్ టైం ఫీడ్ బ్యాక్

Author Icon By Pooja
Updated: October 11, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (Tirumala) ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి ఇటీవల ముగిసిన సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు, అధి కారుల సమష్టి సహకారంతో విజయవంతంగా నిర్వహించగలిగామని టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికా బద్దంగా ప్రతి ఒక్కరూ భగవంతుని సేవగా భావించి ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, 2026 తాగునీయు, ఇతరత్రా సేవలందించారన్నారు. రానున్న ఏడాది బ్రహ్మోత్సవాలకు సిసికెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రం, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనావేసి, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టేందుకు.

Read Also: Explosion: అమెరికా నగరంలో భారీ పేలుడు

ప్రణాళికలు రూపొందిస్తామని ఇఒ తెలిపారు. తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం వెనుక ఉన్న సహకారం, కృషిపై పోలీస్, టిటిడి విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, మీడియాప్రతినిధులతో కలసి తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం సూచనలు, సలహాలతో బాటు సమీక్ష నిర్వహించారు. టిటిడి అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, జెఈఒ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, సివిఎసి కెవి మురళీకృష్ణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటిడి ఇఒ అనిల్కుమార్ మాట్లాడుతూ తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయిన నేపధ్యంలో అదే స్పూర్తితో తిరుచానూరు శ్రీపద్మావతిఅమ్మవారి(Brahmotsavams) బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఈ సారి ఎటుచూసినా సానుకూల వాతావరణం కనిపించిందని అన్నారు. టిటిడి కల్పించిన సౌకర్యాలపై భక్తులు, గ్యాలరీల్లోని, క్యూలైన్లలో భక్తులు వందశాతం సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హమన్నారు. సిఎం చేసిన పలు సూచనలతో, జిల్లా యంత్రాంగం, టిటిడి వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు,భక్తులు, మీడియా సమష్టిసహకారంతో విజయవంతం అయ్యాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Devotees Real-Time Feedback Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.