తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు ఏకాంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఈ ద్వారాల గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Read Also: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు
శ్రీవారి సేవలో ప్రముఖులు
ఈ సందర్బంగా, తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పలువురు మంత్రులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీల తాకిడి దృష్ట్యా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: