📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Tirumala: అలిపిరి మెట్లమార్గంలో మటన్ ముక్కలు.. అవాక్కైన భక్తులు

Author Icon By Sushmitha
Updated: November 10, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: ఏడుకొండలవాడి ఆలయానికి నడిచి వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్టు సిబ్బంది మాంసాహారం తినడం స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో పవిత్రమైన మెట్ల మార్గం అపవిత్రతకు గురైందని భక్తులు మండిపడ్డారు. తిరుమల కొండపై మరియు మెట్ల మార్గంలో మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధం అన్న విషయం తెలిసిందే.

Read Also: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి

Tirumala

భక్తుల ఆగ్రహం, వీడియో వైరల్

బహిరంగంగా మటన్ తింటూ కనిపించిన ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య(Contract Sanitation) కార్మికుల చర్యను చూసి అటుగా వెళ్తున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో(social media) పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఈ విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

టీటీడీ చర్యలు, హెచ్చరిక

తిరుమల(Tirumala) పవిత్రతకు భంగం కలిగించినందుకు గాను టీటీడీ అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మాంసాహారం తిన్న ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, సరసమ్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Alipiri footpath disciplinary action. Google News in Telugu Latest News in Telugu non-veg consumption religious sanctity Telugu News Today tirumala TTD staff

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.