తిరుమల పరకామణి చోరీ కేసుపై సిఐడి పునర్విచారణ ప్రారంభం
తిరుమలలో సిఐడి డిజి రవిశంకర్ లెక్కింపు
తిరుమల : తిరుమల పరకామణి లెక్కింపులో 2023వ సంవత్సరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ పై నిందితుడ్ని అప్పటి పోలీసు అధికారులు, గత పాలకమండలి పెద్దలు తప్పించారనే ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో సిఐడి అధికారులు పునర్విచారణ మొదలుపెట్టారు. ఈ కేసు పురోగతి జావ్యంపై తాజాగా హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం, అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. 2023లో పరకామణిలో చోరీ జరిగిన ఘటనపై నమోదైన కేసుపై తిరుమల వన్డేన్ పోలీసుస్టేషన్లో సిడి రికార్డులు, ఎఫ్ఐఆరు పరిశీలిం చారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. 2023 మార్చినెలలో తిరుమల (Tirumala) పరాకమణి భవనంలో కరెన్సీ నోట్లు, నాణేలు, విదేశీ కరెన్సీ లెక్కింపు సమ యంలో అక్కడ విధుల్లో ఉన్న సివి రవికుమార్ 920 డాలర్లు విదేశీ కరెన్సీని చోరీ చేశాడు. ఆరోజే అక్కడ నిఘాలో ఉన్న ఎవిఎస్ వై.సతీశ్కుమార్ గమనించి అతన్ని పట్టుకున్నాడు. ఆ తరువాత తిరుమల వన్స్టన్ పోలీస్ స్టేషన్లో 24/2023 ఎఫ్ఎఆర్ కూడా నమోదైంది. తదనంతరం ఈ కేసు తిరుపతి రెండవ అదనపు మున్సిప్ కోర్టులో విచారణ చేపట్టారు. 2023మేనెల 20వతేదీ ఛార్జిషీట్ ఫైల్ చేశారు. అయితే ఈ కేసును అప్పటి టిటిడి ధర్మకర్తలమండలి పెద్దలు, కొందరు పోలీస్ అధికారులు మధ్యవర్తిత్వం జరిపి అదే సంవత్సరం సెప్టెంబర్ 9వతేదీ లోక్అదాలత్లో 582 కేసుగా విచారణ సాగింది.
Read also: అన్నం పెట్టని కొడుకు.. కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తండ్రి

సిఐడి డీజీ రవిశంకర్ పర్యటన – కీలక రికార్డుల స్వాధీనం
గతంలో వైసిపి ప్రభుత్వంలోని పెద్దలు, గత టిటిడి (TTD) బోర్డులో పెద్దలు, ఓ ఉన్నతాధికారి, ఓ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించి వాటాలు పంచుకుని లోక్అదాలత్లో రాజీచేశారనేది ప్రధాన ఆరోపణ వచ్చింది. అంతేగాక నిందితుడైన రవికుమార్ 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను టిటిడికి విరాళంగా ఇచ్చాడు. ఈ కేసు మూసివేయడంపై శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో గత నెల 20వతేదీ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తిస్థాయిలో దేవుని పరకామణిలో సొమ్మును కాజేసిన రవికుమార్ను తప్పించిన పోలీస్ అధికారి, టిటిడి ఉన్నతాధికారి ఎవరనే కోణంలో కేసును పునర్విచారణ చేయాలని సిఐడి ఐజిని ఆదేశించింది. ఆ సమయంలోనే ఈ విషయంపై తిరుమల పరకా మణిలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని బోర్డు సభ్యుడు భానుప్రకాశొడ్డి కూడా ఆరోపిం చారు. ఈ చోరీకి సంబంధించి మూడురోజుల్లో ఈకేసు వివరాలు సిఐడి ఐజి ద్వారా న్యాయస్థానానికి అందజేయాలని ఆదేశాలిచ్చింది. అయితే పోలీసు ఉన్నతాదికారులు జాప్యం చేయడంతో దీనిపై సోమవారం జరిగిన విచారణలో సిఐడి డిజికి స్పష్టమైన ఆదేశాలివ్వడంతో మంగళవారం ఉదయం రవిశంకర్అయ్యన్నార్ తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల డిఎస్పీ కె. విజయశేఖర్, 1టౌన్ సిఐ విజయకుమార్, టిటిడి (Tirumala) విజిలెన్స్ వింగ్ విఎస్ ఎన్టీవిరామ్కుమార్, ఆలయ ఏవిఎస్ రాజశేఖర్తో కలసి పరకామణి భవనాన్ని తనిఖీ చేశారు. స్వయంగా పరకామణి భవనంలోకి చేరుకుని కానుకల లెక్కింపు, నోట్లు, నాణేలు వేరు చేయడం, లెక్కించడం, భద్రతాపరమైన అంశాలను స్వయంగా గమనించారు . అక్కడ సిసికెమెరా ఆపరేటర్ చంద్రను కూడా విచారణ చేశారు. కొన్ని సిసిపుటేజీలు స్వాదీనం చేసుకున్నారు. మరీ రానున్నరోజుల్లో ఈ కేసుపై హైకోర్టు న్యాయస్థానం ధర్మాసనం వెలువడించే ఆదేశాలు, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2023లో తిరుమలపరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి సిడి ఫైళ్ళు, రికార్డులు, సిసిపుటేజీలను తిరుమల పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్నాం. అప్పట్లో రికార్డులన్నీ కూడా తీసుకుని వాటికి సంబం ధించి ప్రొసీడింగ్స్ హైకోర్టుకు సమర్పించనున్నట్లు సిఐడి రవిశంకర్ మీడియాకు తెలిపారు. బోర్డు సభ్యుడు భానుప్రకాశొడ్డి కొన్ని ఆధారాలను సిఐడికి సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: