కుట్రదారులను తేల్చేందుకు బోర్డు కీలక నిర్ణయం
తిరుపతి : తిరుమల పరకామణి చోరీ(Tirumala) ఘటనపై మళ్లీ కొత్తగా కేసు నమోదు
చేయాలని టిటిడి(TTD) బోర్డు నిర్ణయించడం సంచలనాలు రేకెత్తించనుందా అనేది హాట్గాఫిక్గా మారింది. ఈ కేసులో రానున్న రోజుల్లో ఎవరూ ఊహించలేని విధంగా దర్యాప్తు జరిగితే అసలు దోషులు ఎవరనేది వెలుగుచూస్తుందా? అసలు ఏ కోణంలో ఎవరు లబ్ధిపొందారనేది తేల్చాలనేది టిటిడి బోర్డు ముందున్న కీలక విషయం. ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదిదారుడు, కీలక వ్యక్తి పూర్వ పరకామణి ఏవిఎస్ ఒ వైవి సతీశ్కుమార్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే కీలక ఫిర్యాది మరణించడంతో కేసు మూసివేయకుండా ఇప్పుడు కొత్తగా తిరుమల పోలీసులకు క్రిమినల్ కేసుగా ఫిర్యాదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఏకంగా ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుబడుల రూపంలో కానుకలుగా సమర్పించుకున్న నగదునే చోరీచేయడం వెనుక అసలు ఎవరున్నారనేది తేల్చి భక్తుల ముందు, చట్టం ముందు బహిరంగం చేయాలనేది బోర్డు నిర్ణయంగా తెలుస్తోంది. 2023 ఏప్రిల్లో తిరుమల పరకామణిలో జరిగిన 920 అమెరికన్ డాలర్లు చోరీలో అప్పట్లో నమోదైన కేసు పరిధి పరిమితంగానే ఉందనే కోణంలో అదేఉదంతంపై మరోకేసు నమోదుకు టిటిడి బోర్డు నిర్ణయిం చింది. మరిన్ని చోరీలు, దుర్వినియోగాల దృష్ట్యా క్రిమినల్ కేసు నమోదు దిశగా ఆలోచన చేసి అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Read also: ఢిల్లీ పేలుళ్లపై అసెంబ్లీలో నిజం ఒప్పుకున్న పాక్ మంత్రి
920 అమెరికన్ డాలర్ల చోరీ వెనుక కుట్ర: కొత్త కేసు నమోదు
2023లో పరకామణి(Tirumala) భవనంలో 920 అమెరికన్ డాలర్లు చోరీచేసి రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడటం, అదేరోజు నిఘాభద్రత పర్యవేక్షిస్తున్న ఏవిఎస్ ఒ వైవి సతీశ్ కుమార్ అతనిని పట్టుకోవడం జరిగింది. తదుపరి దానిపై తిరుమల వన్డేన్ పోలీసే స్టేషన్లో కేసు నమోదు చేశారు. సమగ్రంగా విచారణ చేపట్టి నింది తుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన కొందరు పోలీస్ అధికారులు, టిటిడి గత బోర్డు పెద్దలు, టిటిడి ఓ అధికారి కలసి నిందితుడ్ని అరెస్ట్ చేయకుండా రాజీధోరణిలో లోక్అదాలత్లో అప్పటి ఏవిఎస్ ఒ ఇటీవల అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన సతీశ్కుమార్పై ప్రోద్బలం చేసి రాజీచేయించారనేది ప్రధాన ఆరోపణలు . అందుకు ప్రతిఫలంగా రవికుమార్ నుండి 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను శ్రీవారి కానుకగా రాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కీలకంగా వ్యవహ రించిన గత బోర్డులో పెద్దలు, టిటిడి, పోలీస్ అధికారుల పాత్ర ఏంటనేది తేల్చడానికి ప్రస్తుత టిటిడి బోర్డు కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సమగ్ర దర్యాప్తులో భాగంగా హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో సిఐడి చీప్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 20మంది బృందం మరింత లోతుగా అనేక కోణాల్లో విచారణ చేస్తోంది. పూర్వ ఎవిఎస్ సతీశకుమార్ ఈ కేసుపై గతంలో హైకోర్టులో కౌంటర్దాఖలు చేసి కేసు రాజీలో తనకెలాంటి దురుద్దేశం లేదని, పై అధికారులు చెబితేనే అలా చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. దాని వెనుక అంతర్యమేమిటనేది కొందరు పోలీసు అధికారులు తప్పుపడుతున్నారు.
హైకోర్టు ఆదేశాలతో రవికుమార్ ఆస్తులపై విచారణ
టిటిడి పరిధిలోని అంశం గనుక బోర్డు, ఉన్నతాధికారులు ఆదేశాలు పాటించాలనేది అప్పట్లోనే గుప్పుమంది. ఇదే పరిణామంలో వారం రోజుల క్రిందట ఆయన అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ కేసులో డిసెంబరు 2వతేదీకి తుది నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలతో తాజాగా మరో కొత్తట్విస్ట్ నెలకొంది. వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామికి భక్తులు తమ మొక్కుబడుల్లో భాగంగా హుండీకి సమర్పించిన కానుకలు లెక్కించే పరకామణి నుండి ఏకంగా 920 అమెరికల్ డాలర్లు చోరీ చేయడం పెద్ద విషయంగానే బోర్డు భావిస్తోంది. డాలర్ల చోరీకేసు వెనుక కుట్రదారులను తేల్చేలా విచారణ చేయాలని తీర్మానించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న గత టిటిడి ఛైర్మన్, అధికారులు, పోలీసు అధికారులతోబాటు లోక్అదాలత్లో పరకా మణికేసు రాజీచేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించడం సంచలనంగా మారింది. పరకామణి చోరీ వ్యవహారంలో పెద్దలుగా వ్యవహరించి చేతివాటం చూపిన వారెవరనేది ఇప్పుడు డిసెంబర్ 2వతేదీకి వెలుగుచూడనుంది. అదేగాక చోరీచేసిన గుమస్తా టిటిడి ఉద్యోగికూడా కాకపోవడం మరో కొసమెరుపు.
పూర్వ టిటిడి అధికారులు, పోలీసుల పాత్రను తేల్చే ప్రయత్నాలు
మరోవైపు రవికుమార్ కూడబెట్టిన ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులు, బ్యాంక్భతాలు, లోక్అదాలత్లో రాజీతో ఎవరెవరికి ఎంత మొత్తంలో లాభపొందారనే వివరాలు రాబట్టడంలో ఆయన కాల్దటా ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతంగా చేస్తున్నారు. చోరీ జరిగిన రోజు నుండి రాజీచేసుకున్నవరకు నిందితుడు ఎవరెవరితో, ఎంతకాలంగా, ఎన్ని రోజులు మాట్లాడారు, ఎవరితో వాట్సావ్ ఛాటింగ్లుచేశాడు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయనతో సంభాషించిన వారికాల్దేటానుకూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ పేరున అతనికుటంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులు ఎవరిపేరున మారాయనేది తమిళనాడు ప్రభుత్వం నుండి సమాచారం అందితే ఈ మొత్తం కేసులో చిక్కుముడివీడిపోనుందనేది సమాచారం. ఇప్పుడు కొత్తగా తిరుమల పోలీసులు కేసు నమోదుచేస్తే అసలు దోషులుఎవరనే కీలక విషయాలు వెలుగు లోకి వచ్చే అవకాశం ఉందనేది హాట్గాఫిక్గా మారింది. మరోవైపు రవికుమార్ కూడా తన ఆస్తులపై దర్యాప్తు విచారణ ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: