📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

Author Icon By Saritha
Updated: November 12, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఐడికి దిమ్మతిరుగుతున్న అవినీతి బాగోతం

తిరుమల : ఏడు కొండలస్వామికి భక్తులు సమర్పించే కానుకలు పరకామణి లెక్కింపులో విదేశీ కరెన్సీ, నోట్లను చోరీ చేసిన కేసు సిఐడిని విస్తుగొలిపిస్తోంది. నిందితుడైన (Tirumala) రవికుమార్ పరకామణి భవనంలో పర్యవేక్షణ చేసే డిప్యూటీ ఇఒ, సూపరింటెండెంట్, విజిలెన్స్ విభాగం అధికారులను మభ్యపెట్టి పెద్దజీయంగార్ అండతో ఆడిందే ఆట చేసిందే చోరీ అన్నట్లు ఎవరినీ లెక్కచేయ నితనంగా వ్యవహరించాడనేది సిఐడి అధికారులు తెలుసుకున్న విషయాలు. ఈ విషయాలతో ఎంత కాలంగా పరకామణిలో చోరీ చేస్తున్నాడనేది మాత్రం ఆరా తీస్తున్నారు. తిరుమలలో 2022 ఆగస్టు వరకు హుంఢీ కానుకల లెక్కింపు శ్రీవారి ఆలయంలోపల జరిగేది. అక్కడ ఏం జరుగుతోందనేది మరింత నిశితంగా కనిపెట్టేవారే లేకపోయారనేది అందిన సమాచారం. అదేగాక టిటిడి ఉద్యోగులు, శ్రీవారి పరకా మణిసేవకులు ఆలయంలోపల పరకామణిలో లెక్కించి ఆ తరువాత మహద్వారం గేట్నుండి వెలుపలకు వెళ్ళేవారు. సేవకులు కూడా బయోమెట్రిక్ ప్రవేశంలో ఆలయంలోపలకు చేరుకునేవారు. పైగా కొంత ఇరుకుగా ఉండే ఆలయంలో పరకామణి కేంద్రాన్ని 2022లో విశాలమైన వంద కోట్లు రూపాయలు పైగా దాత సహకారంతో నిర్మించిన భవనంలోకి ఆలయం వెలుపలకు మార్చారు.

 Read also: గోవిందా ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది!

Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

రవికుమార్ స్థిరాస్థులు, భవనాల అన్వేషణలో సిఐడి బృందాలు చురుకుగా

పరకామణి భవనం (Tirumala) మార్చిన తరువాత అక్కడ నాణేల, కరెన్సీ నోట్లు లెక్కింపు స్పష్టంగా తెలిసేలా సిసికెమెరాలు రికార్డు జరుగుతుంది. రోజువారీ దినచర్యల్లో భాగంగా పరకామణిలో గుమస్తా సివి రవికుమార్ కూడా 2023 ఏప్రిల్లో విధులు ముగించుకుని తన పంచకు కుట్టించుకున్న రహస్య అరలాంటి జేబుల్లో విదేశీ కరెన్సీని దాచుకుని తనిఖీలు లేకుండా బయటకు వచ్చేసేవాడనేది సిఐడి రాబట్టిన కీలక సమాచారం. ఇలా ఎంతకాలంగా కొన్ని వందల కోట్ల రూపాయలు చోరీచేసి ఆ సొమ్ముతో స్థిరాస్థులు, భవనాలు నిర్మించాడనేది కీలకంగా అందిన విషయాలు. అయితే 2023 ఏప్రిల్లో జరిగిన చోరీ కేసులో మాత్రమే విజిలెన్స్ ఏవిఎస్ ఒ సతీశ్ కుమార్ పట్టుకోవడం జరిగింది. తదనంతరం పరిణామాలతో ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. విచారణలో ఐదు టీమ్లు క్షేత్రస్థాయిలో విషయాలు సేకరించడం, దాని ఆధారంగా శ్రీవారి కానుకగా టిటిడికి ఇచ్చిన 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను నేరస్తుడి నుండి అందించినా, వాటి విలువ మార్కెట్లో 40కోట్లు చేస్తుందని సిఐడి డిజి అయ్యన్నార్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే.

అయితే తిరుపతి, చెన్నై, కర్నాటక, హైదరాబాద్లో రవికుమార్ ఆస్తులు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసును రాజీచేసి అరెస్టు కాకుండా తప్పించిన గత టిటిడి(TTD) బోర్డు పెద్దలు, పోలీసు అధికారులకు చర్యలు తప్పవనే భయం కలుగుతోంది. నిందితుడు రవి కుమార్కు సహకరించి వెన్నంటి ఉండి సూత్రధా రులుగా సహకరించిన వారిని విచారణ చేసే దిశగా వేగవంతం చేస్తున్నారు. రవికుమార్ విషయంలో సహకరించిన గత విజిలెన్స్, గత టిటిడి పెద్దలు, గత పోలీస్ అధికారుల పాత్రను తేల్చనున్నారు. తదుపరి డిసెంబర్ 2 తరువాత అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందనేది తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CID Chief CID investigation Latest News in Telugu Ravi Kumar Theft Telugu News Tirumala Parakamani Theft Case Tirumala temple TTD board TTD corruption Vigilance Department

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.