తిరుమల : వడ్డీకాసుల వెంకన్న(Tirumala) పరకామణిలో 2023లో అమెరికన్ డాలర్లు చోరీ కేసులో నిందితు డుగా ఉన్న సివి రవికుమార్ ఆస్తులపై విచారణ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అక్రమాలు అవక తవకలు జరిగాయనేది స్పష్టమైందని, సమగ్ర దర్యాప్తు జాప్యం జరిగిందని, త్వరగా విచారణ చేపట్టి డిసెంబర్ 2కి పూర్తిచేయాలని ఐదురోజుల క్రిందట హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల్లో రవికుమార్కు అతని కుటుంబసభ్యులకు సంబంధించి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి?ఏ మేరకు ఆస్తులు సంపాదించారు. అనే కోణంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం ఉదయం ఏసిబి డిజి అతుల్ ్సంగ్ తిరుమలకు రావడంతో ఈ కేసులో దర్యాప్తు మొదలైందని టిటిడి(TTD) వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఈ కేసులో శుక్రవారం కీలకపరిణామం చోటుచేసుకుంది. పరకామణి చోరీకేసులో కౌంటర్గాఖలుచేయాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టిటిడి ఇఒకు హైకోర్టు నోటీసులిచ్చింది. లోక్అదాలత్ఇచ్చిన ఉత్తర్వులను చట్టబద్ధత తేల్చే వ్యవహారాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రఘునందనరావు, జస్టీస్ సుభేందులకు అప్పగించారు. తదుపరి రానున్న నెలలో 17వతేదీకి వాయిదా పడింది. 140కోట్ల రూపా యలకుపైగా విలువైన ఆస్తులు నిందితుడు పేరున, అతని కుటుం బసభ్యుల పేరున ఉన్నాయనే ఆరోపణలు పిటిషనరేపేర్కొన్నారు. అందులో నిందితుడి నుండి అప్పటి టిటిడి పెద్దలు కేవలం 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను దేవుడికి విరాళంగా ఇప్పించేయడం వెనుక కుట్ర ఉందనే అంశంపై ఏసిబి ఆరా తీయనుంది. అయితే 2023 ఏప్రిల్లో పరకామణినుండి అతను చేసిన చోరీ కేవలం 72వేల రూపాయలు విలువమాత్రమేనని అప్పటి టిటిడి బోర్డు పెద్దలు తేల్చి కేసును లోక్అదాలత్వౌరా రాజీచేయడం పెద్ద సం చలనం రేకెత్తించింది.
Read also: తెలంగాణ కేబినెట్‌లో త్వరలో భారీ మార్పులు
హైకోర్టు ఆదేశాలపై సిఐడి, ఏసిబి సంయుక్త విచారణకు రంగం సిద్ధం
ఈ కేసులో శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్ వేయడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఐదురోజుల క్రిందట నిందితుడు ఆస్తులు ఎంత మేరకు విలు వచేస్తాయనే అంశంపై విచారణ చేయాలని ఏసిబి డిజికి ఆదేశాలతో ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం తిరుమలకు వచ్చిన అతుల్సింగ్ శ్రీవారి(Tirumala) దర్శనా నంతరం తిరుపతికి ఏసిబి కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఏసిబి అధికారులతో టిటిడిలో పరకామణిలో వ్యవహారంపై ఆరాతీసినట్లు సమాచారం. అక్కడ రోజువారీగా జరిగే కరెన్సీ నోట్లు, చిల్లర నాణేలు లెక్కింపు ప్రక్రియపై పరిశీలించి తదుపరి 2023 ఏప్రిల్లో ఏం జరిగింది, ఎలా దొంగతనం చేశాడనే కోణంలో ఎంతకాలంగా అతను పరకామణిలో పనిచేశాడనే విషయాలపై తొలినుండి విచారణ చేపట్టి ఆస్తులు కూడబెట్టిన అంశంపై ఏసిబి రంగంలోకి దిగనుంది.
ఇంకా అతని బ్యాంకు ఖాతాల లావా దేవీలుపై కూడా సమాచారం సేకరించే అవకాశం లేకపోలేదననేది తెలుస్తోంది. 2023 ఏప్రిల్ నెలలో 920 అమెరికన్ డాలర్లు చోరీచేస్తూ పటు బడిన రవికుమార్ పై తిరుమల వన్డేన్ పోలీ సులు 24/2023లోనే కేసు కూడా నమోదు చేశారు. తరువాత సమగ్ర విచారణ చేయాల్సిన పోలీసులను టిటిడి పెద్దలు ఎవరు నీరుగార్చేలా ప్రోద్భలం చేశారనేది పూర్తిస్థాయి విచారణ తరువాత డిసెంబర్ 2వతేదీకి సిఐడి డిజి, ఏసిబి డిజి అందించే సీల్డ్కవర్ నివేదికల్లో వెల్లడికానుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పరకా మణి కేసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ రెండువారాల క్రిందట తిరుమలకు చేరుకుని తిరుమల పోలీసుల నుండి పరకామణి చోరీ కేసుకు సంబంధించి రికార్డులను, సిడిలను, పైళ్ళను, సిసికెమెరా పుటేజీలను స్వాధీనం చేసుకుని న్యాయమూర్తి ముందుంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి ఆ తరువాత చోటుచేసు కున్న పరాణామాలపై, లోక్అదాలత్లో రాజీ చేసుకోవడం వరకు అన్ని కోణాల్లోనూ చివరకు లోక్అదాలత్ న్యాయమూర్తి అంశంపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరగనుండటంతో ఎక్క డకు దారితీస్తుందనేది హాట్గాఫిక్గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: