జనవరి 6 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Vaikunta Dwara Darshan: తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమలతో పాటు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి పరిసర ప్రాంతాల వారికి ప్రత్యేక కోటా కింద దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 6, 7, 8 తేదీల్లో జరిగే దర్శనాలకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
Read Also: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?
స్థానిక భక్తులకు ప్రత్యేక కోటాలో వైకుంఠ ద్వార దర్శనం
ఈ ప్రత్యేక కోటా టోకెన్ల కోసం ఆసక్తి ఉన్న స్థానికులు ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ(TTD) అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా 1+3 విధానంలో నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల భక్తులకు రోజుకు 4,500 టోకెన్లు, తిరుమలలో నివాసం ఉండే వారికి 500 టోకెన్లు కేటాయించనున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన భక్తులలో నుంచి ‘ఈ-డిప్’ పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక వివరాలను ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడిస్తామని టీటీడీ తెలిపింది. అర్హులైన స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
ఇదే సమయంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించనున్న ముఖ్యమైన ఉత్సవాల షెడ్యూల్‌ను కూడా టీటీడీ(Tirumala Tirupati Devasthanams) ప్రకటించింది. జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ, 14న భోగి తేరు, 16న గోదాదేవి కల్యాణం, 17న పార్వేట ఉత్సవం, 25న రథసప్తమి జరగనుండగా, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: