📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News telugu:Tirumala-తిరుమల క్షేత్రంలో తొలిపూజ ఆది వరాహునికే

Author Icon By Sharanya
Updated: September 25, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యుద్దీపకాంతులతో తేజోమయమైన కలియుగవైకుంఠం

తిరుమల: తిరుమలదివ్యక్షేత్రంలో భక్తులు తొలి దర్శనం, తొలిపూజ, తొలి నైవేద్యం ఆదివరాహస్వామికే సమర్పిస్తారని నియమంతో శ్రీవేంకటేశ్వరస్వామి ఒప్పందం దానపత్రం రాసిచ్చాడు. వరాహస్వామి(Varahaswamy)ని తొలుత దర్శిస్తేనే శ్రీవేంకటేశ్వరుడు సంతోషిస్తాడు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీవరాహస్వామిని దర్శించు కున్న తరువాతనే శ్రీనివాసుని దర్శించుకోవడం సంప్రదాయం.

News telugu

ఒక్కోకొండకు ఒక్కో ప్రత్యేకత

శ్రీమహావిష్ణువు వైకుంఠం వదలి కలియుగంలో వేంకటాచలం(Venkatachalam)పై శ్రీవేంకటేశ్వరునిగా ఆవిర్భవించిన సమయం లో శేషాచలంకొండల్లోని సప్తగిరులపై తన నివాసముంటే అన్నింటా శుభకరమని భావించాడు. తిరుమల గిరులు ఏడుకొండలకు ప్రతీతి. ఈ కొండలకు గరుడపురాణంలో ఒక్కోకొండకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులు ఎంతో పవిత్రంగా, భక్తిభావంతో కొండలెక్కి వస్తారు. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. శక్తిస్థానాలుగా ఉన్న ఏడుకొండలు ఎక్కడం కూడా ఒకరహస్యం శ్రీమహావిష్ణువు కొలువుండే వైకుంఠానికి ఏవిధంగా జయవిజయులు కాపలాగా ఉంటారో అలాగే కలియుగవైకుంఠం తిరుమలలో ఆనందనిలయంలో బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు శంఖుచక్ర గధాదారులై సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంలా దర్శనమిస్తుంటారు.

వీరిని’చండప్రచండులు”అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరి స్తుంటాయి. స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నాన మాచరించి, శుచిగా ఆలయంలోనికి ప్ర శించి ఆలయ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగుతూ తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి.

Adi Varaha Swamy Breaking News First Pooja Hindu Traditions latest news Telugu News tirumala Tirumala temple tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.