📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: అభిప్రాయసేకరణతో తిరుమలలో మెరుగైన సేవలు

Author Icon By Sharanya
Updated: July 8, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: దేశం నలుమూలల నుండేగాక విదేశాల నుండి ప్రతిరోజూ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాని (Lord Venkateswara Swamy Temple) కి వస్తున్న భక్తుల నుండి తీసుకుంటున్న అభిప్రాయసేకరణతో తిరుమలలో అన్నదానం, కల్యాణకట్ట, వసతి విభాగాల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయని భక్తులు తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించేందుకు క్యూలైన్లో వేచివుండటమేగాక క్షురకులకు డబ్బులిచ్చుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడా అవసరం లేకుండా భక్తులు సాఫీగా తలనీలాలు త్వరగా సమర్పించుకునేలా చూడటం బావుందని భక్తులు తమ అభిప్రాయాలను చెబుతూన్నారు.

రోజు 1.20లక్షల మందికి అన్నప్రసాదాలు

ఇక కొండకు వచ్చిన ధనవంతుల నుండి సామాన్యభక్తులు వరకు వసతి కోసం తాపత్రయం పడటం కనిపిస్తుంది. అయితే తిరుమల (Tirumala) లో ఎలాంటి సిఫార్సులు లేకున్నా భక్తులు తమ ఆధార్కార్డు ఆధారంగా సిఆర్ కేంద్ర కార్యాలయం (CR Central Office) వద్ద ఏఆర్పి కౌంటర్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే అర్ధగంటలోపే గది లభ్యత సులభంగా మారింది. ఇక రోజువారీగా తిరుమలకు వస్తున్న 90వేలమంది వరకు భక్తులు దర్శనానికి ముందు, దర్శనానంతరం కూడా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, పుడ్కౌంటర్లలో 1.20లక్షల మంది వరకు అన్నప్రసాదాలు స్వీకరిస్తుండటం ఆనందం వెలిబుస్తున్నారు. అన్నప్రసాదాల రుచి. నాణ్యత తయారీ శుభ్రత వందరెట్టు మెరుగైందని భక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ మార్పులన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి స్వీయపర్యవేక్షణతోనే సాథ్యమైందనేది టిటిడి వర్గాలు, భక్తులు, శ్రీవారి సేవకులు వ్యక్తం చేస్తున్న అనుభవం. తిరుమల (Tirumala) లో ఇంకా ప్రైవేటు హోటళ్ళు, ఫాస్టుపుడ్లలో కూడా శుచిగా, రుచిగా నాణ్యతతో భోజనం, దక్షిణభారతదేశం వంటకాలతో ఆహారపదార్థాలు వడ్డిస్తుండటం జరుగుతోంది. లక్షలాదిమంది భక్తులు రోజుకు వస్తున్న పుణ్యక్షేత్రంలో ఇంతటి మార్పులు రావడం టిటిడి ఇఒ, అదనపు ఇఒల స్వయం పర్యవేక్షణ, వారి కృషి ఫలితమేనని టిటిడి ఉద్యోగులు చెప్పడం ప్రత్యేకత. ఇక కొండకు చేరుకున్న సామాన్యభక్తులకు ముఖ్యమైన అంశం స్వామివారి దర్శనం వీలైనంత వరకు త్వరగా చేయించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వందమంది భక్తుల్లో 80మంది భక్తులు క్యూలైన్లలో నిరీక్షణ సమయం తగ్గించాలని, ఆలయంలోపలకు నాలుగైదు గంటల్లో చేరుకునేలా చూడాలని అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

సాధారణరోజుల్లోనే రోజుకు 90వేలమంది వరకు వస్తున్న భక్తుల సంఖ్య వారాంతం, ప్రత్యేక సెలవురోజుల్లో 1.20లక్షల వరకు చేరుకుంటున్నారు. ఇంతభారీగా భక్తులు చేరినా సౌకర్యాలు మెరుగుపడటం ఆనందించదగిన విషయంగా భక్తులు చెబుతున్నారు. అయితే సామాన్యభక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మరింత త్వరగా చేయించేలా చూస్తే బావుంటుందనేది భక్తుల్లో వ్యక్తమవుతున్న తాజా అభిప్రాయాలు. ఇందుకు రకరకాల దర్శన విధానాల్లో భక్తులు రావడం కూడా ఉంది. నేరుగా తిరుమలకు చేరుకుంటే నాలుగైదు గంటల్లోనే తోపులాటలేని, సౌకర్యవంతమైన దర్శనం చేయిస్తే చాలని చెబుతున్నారు. తిరుమలలో ఇప్పటికే అన్ని రకాలుగా మెరుగైన సేవలందించడంలో మార్పులు తీసుకురావడం శుభపరిణామమని వేలాదిమంది భక్తులు తమ సంతోషం వ్యక్తం మార్పులు తీసుకురావడం శుభపరిణామమని వేలాదిమంది భక్తులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు కూడా నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కలిగింది. ఐవిఆర్ఎస్, వాట్సాప్(93993 99399), ఈ సర్వే,శ్రీవారిసేవకులద్వారా అభిప్రా య సేకరణ తీసుకోవడమేగాక 16 అంశాలపై భక్తులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ కోసం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు .

తిరుమల ఇతర పేర్లు?

అందుకే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు మరియు ఇక్కడి దేవతను కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం మరియు తిరుపతి బాలాజీ ఆలయం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.


తిరుపతి ఏడు కొండలు ఏవి?

కొండల చుట్టూ శేషాచలం శ్రేణిలోని ఏడు శిఖరాలు ఉన్నాయి, అవి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి అనే తూర్పు కనుమలు. శ్రీ వేంకటేశ్వరుని ఆలయం[2] ఏడవ శిఖరం (వెంకటాద్రి)పై ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: TTD : పుస్తకాలను ప్రసాదంగా ఇచ్చే టీటీడీ యోజన

Breaking News latest news Telugu News tirumala Tirumala Annadanam Tirumala TTD TTD Online Services

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.