📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Tirumala: అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి నుండి సిఐడి, ఎసిబి దర్యాప్తు షురూ

తిరుమల : చిరు ఉద్యోగి… ఆపై పరకామణిలో లక్షల్లో చోరీ… ఆదాయానికి మించి (Tirumala) ఆస్తులు కలిగి ఉన్నాడనే అనుమానాలపై హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో నిందితుడు రవికుమార్ ఆస్తుల లెక్కలు తేల్చేపనిలో సిఐడి, ఎసిబి అధికారులు రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళు సేకరించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ (ఐటి), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కి అందజేయాలని వెలువడించిన ఆదేశాల వెనుక పెద్దకుట్ర ఉందనేది న్యాయస్థానం కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. క్షుణ్ణంగా నిందితుడు ఆస్తులు ఎలా సంపాదించాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరెవరికి విక్రయించాడు, ఇంకా ఏ మేరకు ఆస్తులు ఉన్నాయనే వివరాలు సేకరణలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ బృందం, ఎసిబి చీఫ్ బృందం కార్యాచరణ రూపొందించుకుని సిద్దమైంది. ఇప్పటికే ఈ తతంగంలో నిందితుడికి సంబంధించి తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు తగిన ఆధారాలు సేకరించి హైకోర్టు ధర్మాసనానికి సమర్పించింది. ఇంకా ఆ ఆస్తుల క్రయవిక్రయాల డాక్యుమెంట్లను, రికార్డులను సిఐడి రాబట్టిందనేది కీలక సమాచారం. ఇప్పుడు వీటన్నిటిపై నిశితంగా దర్యాప్తు చేసి తదువరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు ఐటి, ఇడిలకు సమాచారం ఇస్తే ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది టిటిడిలో, రాజకీయవర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

Read also: ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

Tirumala Everyone’s attention is focused on Ravikumar’s assets!

పరకామణి చోరీ కేసులో లోతైన దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు

2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో(Tirumala) గుమస్తా సివి రవికుమార్ 920 అమెరికన్ డాలర్లు చోరీ చేయడం, తిరుమల పోలీసులు కేసు నమోదు చేయడం, తదుపరి విచారణ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోలేదని, లోక్ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం వరకు అంతా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా మరింత లోతుగా దర్యాప్తుకు హైకోర్టు ధర్మాసనం ఆదేశించడంతో సిఐడి, ఎసిబితో బాటు ఐటి, ఇడి శాఖల అధికారులు ఇక రంగంలోకి దిగుతున్నారు. 2023 జూన్లోనే అప్పటి టిటిడి బోర్డు పెద్దలు రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను 7 గిఫ్ట్ డీడ్లుగా శ్రీవేంకటేశ్వరస్వామికి స్వీకరించడం జరిగింది. వాటి విలువ మార్కెట్లో రూ.40 కోట్లు చేస్తుందని సిఐడి అంచనా. చోరీ సొత్తు విలువ లక్షల్లో ఉంటే శ్రీవారికి కానుకగా రూ.14 కోట్ల ఆస్తులు ఎందుకు స్వీకరించారనేది హైకోర్టు అనుమానాలు. ఈ వారంలో అనుమానాలు పటాపంచలు కానున్నాయనే చర్చమొదలైంది. ఈ కేసులో ఇప్పటికే గత వైసిపి ప్రభుత్వ హయాంలోని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్లు వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్రెడ్డిని, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డితోబాటు మాజీ సివిఎస్ నరసింహ కిశోర్, మాజీ విజిఒ గిరిధర్, ఏవిఎస్ పద్మనాభంను, అప్పటి తిరుమల సిఐలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను పరకామణి విధుల్లో ఉన్న టిటిడి అధికారులను వరుసగా 35మందిని పలు దఫాలుగా విచారణ చేసి వాంగ్మూలాలు రాబట్టిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CID ACB Investigation disproportionate assets case Ravi Kumar Case Telugu News Tirumala News TTD Parakamani theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.