📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirumala Electric Buses: తిరుపతి–తిరుమల రూట్‌లో పూర్తిగా విద్యుత్‌ బస్సులే

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆస్తానమైన తిరుమలలో పూర్తిస్థాయి విద్యుత్‌ వాహనాల(Tirumala Electric Buses) వ్యవస్థను అమలు చేయడానికి టీటీడీ వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్, పెట్రోల్‌ ట్యాక్సీలు మరియు టీటీడీ అద్దె వాహనాలను దశలవారీగా తొలగించే ప్రణాళికను అధికారులు రూపొందించారు.

టీటీడీ(TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdhary) తెలిపారు. తిరుమల–తిరుపతి మార్గంలో విద్యుత్‌ బస్సులను మాత్రమే నడపే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పాత ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Read Also: Tirumala Vaikunta Dwaram: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం వివరాలు

Fully electric buses on the Tirupati-Tirumala route

విద్యుత్‌ వాహనాలతో మార్చే ప్రక్రియ

తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌస్‌(Padmavati Guesthouse)లో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా నిలిచింది. తిరుమలలో సేవలందిస్తున్న ట్యాక్సీలు, అద్దె వాహనాలను విద్యుత్‌ వాహనాలతో మార్చే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సీనియర్ కన్సల్టెంట్ కునాల్ జోషి వివిధ సాంకేతిక, రవాణా అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో టీటీడీ(TTD) డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు, వీజీవో సురేంద్ర, ఐటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు నాయుడు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

diesel vehicle ban Tirumala pollution-free Tirumala Tirumala electric vehicles Tirupati electric buses TTD environment initiative TTD EV plan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.