📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirumala : భక్తుల ఫీడ్ బ్యాక్ ప్రామాణికం!

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 9:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala : ఏడుకొండలవాడ గోవిందా.. వడ్డీకాసులవాడ గోవింద నామస్మరణ చేస్తూ ఎంతో భక్తివిశ్వాసాలతో తిరుమలకు వస్తున్న సామాన్యభక్తులకు దేవదేవుని దర్శన అవకాశాలు మరింత సులభతరం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirupati Temple) ఆలోచన చేస్తోంది. ఇప్పటికే తిరుమలలో టిటిడి పాలకమండలి తీసుకున్న కొన్ని దర్శనాల నిర్ణయాలతో సామాన్యభక్తులు సంతోషంగా, సంతృప్తికరంగా గోవిందుని దర్శనం చేసుకోగలుగుతున్నారు. తెల్లవారుజామున 3.30గంటలకు వైకుంఠమ్ కంపార్టుమెంట్లలో వేచివుండే సామాన్యభక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 5.30 గంటలకే విఐపి బ్రేక్ దర్శనాలు ప్రారంభించి 7.30-8 గంటలలోపే ముగించేలా చూస్తున్నారు. ఆ తరువాత ఉదయం 10గంటల వరకు సామాన్యభక్తులకు నిరంతరాయంగా ఆలయంలోపలకు అనుమతించి శ్రీవారిని దర్శించుకునే విధానం బావుందని భక్తులు అభిప్రాయం ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 12.30 – 1 గంట వరకు శ్రీవాణి బ్రేక్ దర్శనాలు భక్తులు, టిటిడి ఉద్యోగులు భక్తులకు దర్శనాలు చేయిస్తున్నారు. ఈ విధానం వల్ల సామాన్యభక్తుల (Ordinary devotees) దర్శనాల్లో కొంత తేడాలొస్తున్నాయనేది భక్తుల నుండి సేకరించిన అభిప్రాయం.

దీంతో విఐపి బ్రేక్ దర్శనాలను దశాబ్ధకాలం క్రింద అమలుచేసిన తరహాలోనే మళ్ళీ సాయంత్రం వేళ విఐపి బ్రేక్ దర్శనాలు అమలుచేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలనలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 2వేల వరకు టిక్కెట్లు మంజూరవుతున్నాయి. కేంద్రమంత్రులు, రాజ్యాంగపరిధిలోని ప్రముఖులు వారి సిఫార్సు లేఖలపై 1,500 వరకు బ్రేక్ టిక్కెట్లు, టిటిడి పాలకమండలి ఛైర్మన్, సభ్యుల లేఖలపై 500 వరకు, దాతలు, స్వయంగా వస్తున్న ప్రోటోకాల్ విఐపిలకు 600వరకు దర్శనాల విఐపి బ్రేక్ లు, 1,500వరకు శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లుపై భక్తులు పలు రకాల సమయాల్లో శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/high-court-four-sworn-in-as-ap-high-court-judges/andhra-pradesh/530066/

Breaking News in Telugu devotee satisfaction devotees feedback Latest News in Telugu pilgrimage news Telugu News Paper temple management

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.