📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala – ఆన్లైన్లో డిసెంబర్ నెల ఆర్జితసేవా టికెట్లు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

22న వర్చువల్ సేవా టిక్కెట్లు

లక్కీడిప్ విధానంలో 23న శ్రీవాణి టిక్కెట్లు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రోజువారీ, వారాంతపు ఆర్జితసేవలకు సంబంధించి డిసెంబర్ నెలకోటా టిక్కెట్లు గురువారం ఉదయం నుండి టిటిడి (TTD) ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఇందుకు టిటిడి ఐటి విభాగం (TTD IT Department) అన్ని ఏర్పాట్లుచేసింది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల దర్శన సమయం సాయంత్రం 4.30గంటలకు నిర్ణయించింది. అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్ లక్కీడిప్లో జారీచేస్తారు.

నేడు 18వతేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఆర్జితసేవా టిక్కెట్లు (Arjitha Seva Tickets) విడుదల చేస్తే 20వతేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 20వతేదీ నుండి 22వతేదీ మద్యాహ్నం 12గంటలలోపు సొమ్ము చెల్లించి టిక్కెట్లు మంజూరవుతాయి. 22వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకారసేవల టిక్కెట్లను విడుదల చేయనుంది.

Tirumala

దర్శన కోటా

22న ఆన్లైన్లో వర్చువల్ సేవా టిక్కెట్ల (Virtual service tickets) ను మధ్యాహ్నం 3గంటలకు విడుదలవుతాయి. శ్రీవాణి టిక్కెట్లు 23న ఉదయం 11గంటలకు, వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటా ఆగస్ట్ 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా 24న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. గదుల కోటాను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టిక్కెట్లును “టిటిదేవస్థానమ్స్. ఎపి. జివొవి. ఇన్”వెబ్ సైట్గాద్వారా బుక్చేసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-schools-moral-education-no-longer-taught-in-schools/andhra-pradesh/549582/

Breaking News latest news online release room quota online senior citizens and disabled quota special entry darshan tickets 300 rupees Srivani Tickets Telugu News virtual seva tickets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.