Tirumala: తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో పనిచేయాలనుకునే వారి నుంచి టీటీడీ (TTD) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీరికి ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తోంది. ఇక ప్రొటోకాల్ దర్శన అవకాశం కూడా పొందవచ్చు. పనిచేసే అవకాశాన్ని డాక్టర్లు, నర్సులు, టెక్నిషీయన్లు, వైద్య సిబ్బందికి అవకాశం కల్పిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో వీళ్లు పనిచేయాల్సి ఉంటుది.
నెలలో సగటున వారం రోజుల పాటు సేవలు అందించవచ్చు. వీరికి ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయాలు అందిస్తారు. అంతేకాకుండా వీరికి, వీరి కుటుంబసభ్యులు ప్రొటోకాల్ దర్శన అవకాశం కూడా కల్పిస్తారు. ఇలా వైద్య సేవ చేయాలనుకునేవారికి టీటీడీ అనేక ఉచిత సదుపాయాలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోంచుకోవాలవని వైద్య సిబ్బందికి టీటీడీ సూచిస్తోంది.
Read Also: AP RTE Notification 2026: ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్
ఆసక్తి గల వైద్య నిపుణులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తులో తమ వృత్తిపరమైన అనుభవం, సాధించిన అవార్డులు, తాము అందించగల సేవల వివరాలను పొందుపరచాలి. ఈ దరఖాస్తులను స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల సీఈవోలు క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం ఎంపికైన వారికి వారు ఏ రోజుల్లో ఆస్పత్రుల్లో సేవలు అందించాలనే తేదీలను ఖరారు చేసి సమాచారం అందిస్తారు.
ప్రముఖ వైద్యుల భాగస్వామ్యం – సంప్రదింపు వివరాలు
ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుండి ప్రముఖ వైద్యులు ప్రతి వారం ఇక్కడ సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ వైద్య బృందాల సూచనల మేరకు ఆసుపత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు మరియు చికిత్సా విధానాల్లో మార్పులు చేస్తూ నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం 91542 16307 నంబర్‌కు లేదా srivarivaidyasevasvims@gmail.com మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: