हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Tirumala: సీల్డు కవర్లో సిఐడి దర్యాప్తు

Saritha
Latest News: Tirumala: సీల్డు కవర్లో సిఐడి దర్యాప్తు

నిందితుడి తరపున న్యాయవాది అభ్యర్థన తిరస్కరణ

పరకామణి కేసు విచారణ 5వ తేదీకి వాయిదా

తిరుమల : తిరుమల(Tirumala) పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు చేపట్టిన దర్యాప్తు వివరాలను సీల్డ్క్వర్లో మంగళవారం అధికారులు హైకోర్టుకు నివేదించారు. రిజిస్ట్రార్ జ్యూడీషియల్ ద్వారా న్యాయమూర్తికి నివేదికలను అందజేయడంతో తదుపరి 5వతేదీ శుక్రవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేశారు. 26 రోజుల పాటు 35 మంది వరకు సాక్షులను, అధికారులను, మాజీ చైర్మన్లను, ఫిర్యాదిదారు లను, నిందితుడ్ని పలు కోణాల్లో విచారణ చేసి రాబట్టిన వివరాలను రికార్డుచేసి 156 పేజీల నివేది కలను మంగళవారం న్యాయమూర్తి ముందు ఉంచారు. దీంతో ఈకేసు విచారణ చేపడితే తదుపరి ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు వెలువడిస్తారని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే శుక్రవారానికి వాయిదా వేయడంతో అప్పటివరకు ఆ సీల్డుకవర్లో నిక్షిప్తమైన వివరాలు, ఆధారాలు ఏమిటనేది టిటిడి వర్గాల్లో, రాజకీయనేతల్లో ఆసక్తి కరమైన చర్చమొదలైంది.

2023లో జరిగిన పరకామణిలో చోరీ కేసు 920 అమెరికన్ డాలర్లును గుమస్తా సివి రవికుమార్ దొంగతనం చేయడం, దీనిపై అప్పటి ఎవిఎస్ఐ వై.సతీశ్కుమార్ పట్టుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దానిపై పోలీసులు కేసునమోదు చేశారు. అనూహ్య రీతిలో ఈ కేసులో దర్యాప్తు అనేక మలుపులు తిరగడం, ఏకంగా అప్పటి టిటిడి బోర్డు పెద్దలు నిందితుడు రవికుమార్ నుండి 14కోట్ల రూపా యలు విలువచేసే ఆస్తులను శ్రీవేంకటేశ్వరస్వామికి కానుకగా స్వీకరించడం జరిగిపోయింది. అప్పటికే ఈ కేసులో నిందితుడ్ని కాపాడి లోక్అదాలత్లో రాజీచేసుకున్నారు. అక్కడికి భక్తులు సమర్పించిన కానుకల చోరీ కేసు మూసివేశారు.

Read also: ఈ యేడాది పెరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల సంఖ్య!

Tirumala
Parakamani case hearing postponed to the 5th

టిటిడీ కేసులో సీఐడీ 156 పేజీల నివేదిక

అయితే గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Tirumala) ఏర్పాటుతో హైకోర్టులో శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్తో హైకోర్టు న్యాయమూర్తి విచారణకు ఆదేశించడం, తిరిగి మూసేసిన కేసులో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ నవంబర్ 6వతేదీ నుండి ప్రత్యేక బృందాలతో సమగ్రంగా క్షేత్రస్థాయిలో లోతైన దర్యాప్తు చేపట్టారు. సిఐడి చోరీకేసులో విచారణలో భాగంగా రెండవ దఫా తిరుపతికి వస్తున్న పూర్వ ఎవిఎస్ వై. సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంకూడా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నిందితుడు రవికుమార్, అతని భార్య రమ్యనుండి మొదలుపెట్టిన విచారణ మాజీ టిటిడి(TTD) ఛైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఇఒ ఎవి ధర్మారెడ్డిని, పూర్వ సివిఎసి నరసిం హకిశోర్, విజిఒ గిరిధర్, పద్మనాభంలతోబాటు 2023 ఏప్రిల్లో పరకామణిలో డిప్యూటీ ఇఒ, సూపరింటెండెంట్లను, శ్రీవారిసేవకు లను విచారణచేసి సమాచారం రాబ ట్టారు. ఆమొత్తం సమాచారం 156 పేజీలుగా తయారుచేసి సీల్డుకవం లో సిఐడిఅధికారులు హైకోర్టుకు సమర్పించారు. శుక్రవారానికి వాయిదావేయడంతో ఆరోజు ఏంతీర్పు వెలువడనుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిందితుడు తరపున న్యాయవాది సిఐడి నివేదికలను కోరుతూ దాఖలుచేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఈ కేసు బలం ఏపాటిదో, రవికుమార్ ఆస్తుల వివరా లపైవెలువడే ఆదేశాలు తీవ్రస్థాయిలోనే ఉంటాయనేది అందరూ ఊహిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870