📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala Child Kidnap Case: తిరుమల చిన్నారుల కిడ్నాప్ కేసు ఛేదన: నిందితురాలు అరెస్ట్

Author Icon By Siva Prasad
Updated: February 19, 2026 • 10:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Child Kidnap Case: ఈ నెల 16వ తేదీన తిరుమలలోని నాదనీరాజనం ప్రాంతంలో నవదుర్గ (05), అశ్విని (03) అనే ఇద్దరు బాలికలు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు, జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిసిటివి ఫుటేజీలు మరియు సాక్షుల సమాచారం ఆధారంగా నిందితురాలు అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన గుండ్లూరు శివమ్మ (42) అని గుర్తించారు.

Read Also: Tirupathi : శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

కొవ్వూరులో దొరికిన నిందితురాలు – చిన్నారుల రక్షణ

నిందితురాలు శివమ్మ చిన్నారులను తిరుమల నుండి తిరుపతి మీదుగా రైలులో రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లింది. తిరుమల పోలీసుల సమాచారం మేరకు అప్రమత్తమైన రైల్వే పోలీసులు, 17వ తేదీన కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారులను రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి తరలించగా, నిందితురాలిని మహిళా హోంకు పంపారు. నిందితురాలిని విచారించగా, సులభంగా డబ్బు సంపాదించేందుకు చిన్నారులతో బలవంతంగా భిక్షాటన చేయించాలనే ఉద్దేశంతోనే అపహరించినట్లు నేరాన్ని అంగీకరించింది.

Tirumala Child Kidnap Case: తల్లిదండ్రులకు అప్పగింత – పోలీసుల సూచనలు

పట్టుబడిన నిందితురాలు శివమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, తిరుపతి సి.డబ్ల్యు.సి (CWC) ద్వారా వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మవద్దని సూచించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన సిఐ రాముడు, ఎస్‌ఐలు రమేశ్ బాబు, చలపతి, నరేష్‌లను ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Child Kidnapping Solved Gundluru Shivamma Arrest Kovvur Railway Station SP Lankela Subbarayudu Tirumala Kidnap Case Tirumala Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.