📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Tirumala: అలిపిరిలో బ్రీత్ అనలైజర్లతో తనిఖీ.. 8 లక్షల పరికరాలు అందజేత

Author Icon By Rajitha
Updated: December 22, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రానికి మద్యం సేవించి కొండెక్కాలని చూస్తే ఇకపై అలాంటి ఆటలు సాగనీయకుండా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీచేసేందుకు టిటిడి, తిరుపతి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు అవసరమైన బ్రీత్ ఎనలైజర్లను టిటిడి తిరుపతి పోలీసులకు అందజేసింది. తొలివిడతలో 20 బ్రీత్అనలైజర్లు అందజేయగా వీటిల్లో నాలుగు అలిపిరి తనిఖీ కేంద్రానికి, మరో నాలుగు తిరుమలకు అందించారు. మిగిలిన 12 వాటిని తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. తిరుమలను పవిత్ర క్షేత్రంగానే భావించి భక్తులు, స్థానికులు, కార్మికులు పవిత్రతను కాపాడటానికి ఇతోధికంగా సహకారం అందించాలి. అయితే కొన్ని సందర్భాల్లో కార్మికులు, స్థానికులు, యాత్రికులు కూడా మద్యం సేవించి మత్తులో కొండకు ఆర్టీసి బస్సుల్లో, ట్యాక్సీల్లో వచ్చేస్తున్నారు. ఇలా తోటి భక్తులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై ఇప్పటికే టిటిడికి అందిన ఫిర్యాదులతో తగిన చర్యలకు ఉపక్రమించింది.

Read also: Kakani Govardhan Reddy : ఇరిగేషన్ అధికారులపై రెచ్చిపోయిన కాకాణి

Tirumala

మద్యం సేవించి బండి నడిపేవారినేగాక

యాత్రికులను అలిపిరి తనిఖీ కేంద్రంలో తిరుమలలో జిఎన్సి టోలేట్లో తనిఖీ చేసేందుకు బ్రీత్ ఎనలైజర్లు పరికరాలు అందజేశారు. ఆదివారం ఉదయం టిటిడి ఇఒ కార్యాలయంలో జరిగిన కార్యక్ర మంలో టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, టిటిడి సివిఎస్ ఒ కెవి మురళీకృష్ణ, అదనపు ఎస్పీలు రవిమనోహరచారి, శ్రీనివాసులు, డిఎస్పీలు రామకృష్ణమాచారి, విజయశేఖర్, సిఐలు హరిప్రసాద్, సంజీవకుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. తిరుమల పోలీసులకు, తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు ఇఒ సింఘాల్, ఎస్పీ సుబ్బ రాయుడు స్వయంగా అందజేశారు. ఘాట రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, భక్తుల భద్రతకు టిటిడి చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా మద్యం సేవించి బండి నడిపేవారినేగాక కొండెక్కేవారిని పట్టుకునేందుకు ఇవి ఉపయోగిస్తారు. తొలిరోజే ఆదివారం సాయంత్రం అలిపిరి టోల్ గేట్ లో వీటిని ఉపయోగించారు. కాగా బ్రీత్అనలైజర్ల పనితీరును స్వయంగా ఎస్పీ సుబ్బరాయుడు ఇఒకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Alipiri Breath Analyzer tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.