📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirumala : తక్కువ ధరలో తిరుపతిలో బ్రాండెడ్  హోటళ్లు

Author Icon By Shravan
Updated: July 30, 2025 • 1:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : భక్తుల అవసరాలకు తగ్గట్లు నాణ్యమైన,రుచితో కూడిన శుచిగా సాంప్రదాయం ఆహారం వడ్డించే పెద్ద హోటళ్ళు తిరుమలలో (Tirumala) ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం కొన్ని నిబంధనలతో, ఖచ్చితంగా సాంప్ర దాయ వంటకాలనే తయారుచేయాలని టిటిడి అధికారులు టెండర్లు ద్వారా బ్రాండెడ్ హోటళ్ళను ఎంపికచేశారు. ప్రస్తుతం ఐదు హోటళ్ళకు నిబంధనలమేరకు అనుమతించారు. తిరుమలలోని పద్మా వతినగర్ ఏరియా, మ్యూజియం ప్రాంతం, కల్యాణకట్టకు సమీపంలోని వాటర్ ఫౌంటైన్ ప్రాంతంలో గతంలో కొందరు వ్యాపారులు నడిపిన హోటళ్ళు ఇప్పుడు కొత్తగా బ్రాండెడ్ హోటళ్ల యాజమాన్యం చేతిలోకి వెళ్ళాయి.

గతంలో శ్రీవత్స హోటలను (Hotels) ప్రస్తుతం చెన్నై అడయార్ ఆనంద్భవన్ యాజమాన్యం, కౌస్తుభం వద్ద టిటిడి స్వాధీనం చేసుకున్న హోటలు హైదరాబాద్కు చెందిన దంతూర్ గ్రూఫ్ ఆఫ్ హోటల్సు, సందీఎ మయూరా హోటల్ను హైదరాబాద్ ప్రెస్ట్ హాస్పిటాలిటీ యాజమాన్యంకు, ఎస్వీగెస్ట్ హౌస్, సారంగి పేరుతో ఉన్న హోటళ్ళను ముంబైకు చెందిన దిన శ్రీసుఖ్సగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ కు, సప్తగిరి హోటల్ను గుజరాత్ సంకల్ప రిక్రియేషన్ యాజమాన్యం చేతికి అప్పగించారు. ఈ హోటళ్ళన్నీ వ్యాపారధోరణితోకాకుండా సేవాభావంతో భక్తులకు సేవలందించాలని టిటిడి అధికారుల సూచన.

సాధారణంగానే తిరుమలలో ఏ వ్యాపారాలైన భక్తుల అవసరాలు, వారి కోసం నడుస్తున్నవే. పూర్తిగా భక్తులపైనే ఆధారపడి హోటళ్ళు, టీదుకాణాలు, ఇతరత్రా వ్యాపారాలు జరుగుతాయి. గతంలో తిరుమలలో పెద్ద పెద్దహోటళ్ళు ఉన్నా వాటిల్లో నాణ్య మైన ఆహారం లేదని, ధరలు అధికంగా ఉండేవని భక్తులు ఫిర్యాదులు. అంతేగాక టిటిడి అధికారుల తనిఖీల్లోనూ శుచి, రుచి లేదని తేల్చారు. దీంతో కొన్ని హోటళ్ళను మూసివేయగా మరికొన్ని హోటళ్ళు టెండర్లు పూర్తయి తిరిగి స్థానికులకు అప్పగించలేదు. ఆ పెద్ద ఐదు హోటళ్ళను ఇప్పుడు బ్రాండెడ్, విశ్వాసమున్న సాంప్రదాయ భోజనాలు తయారుచేసి అందిం చాలని సూచనలతో ఏర్పాటుకు ముందుకువచ్చాయి. తిరుమలలో మూడు వరకు పెద్ద హోటళ్ళు, 10వరకు జనతా క్యాంటీన్లు, 20వరకు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు నడుస్తున్నాయి.

వీటిల్లో కూడా అధిక ధరలు, ఉత్తరభారతదేశం చైనీస్, గోబీ వంటి ఆహారం పదార్థాలు రంగులతో తయారుచేసి భక్తులకు వడ్డిస్తున్నారనేది ఫిర్యాదులు,. దీనిపై అందిన సమాచారంతో టిటిడి ఇప్పటికే తిరుమలలో చైనీస్ పుడ్స్, గోబీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లకు అనుమతించలేదు. పూర్తిగా శాఖాహారం, దక్షిణభారతదేశ వంటకాలతోనే సేవాభావంతో హోటళ్ళు నడపాలనేది టిటిడి ధ్యేయం. తిరుమలకొండ పైకి కూరగాయలు, బియ్యం, పప్పులు, చివరకు పాలు, గాజుసీసాల్లో తాగేనీరు కూడా ఘాట్లో రవాణా భారం కూడా భక్తులపైనే మోపుతారు.

ఒకలీటర్ మంచినీటి సీసా 20రూపాయలకే లభిస్తుండగా తిరుమలలో గాజుసీసా నీటిని 30-35 రూపాయలకు విక్రయిస్తున్నారు. సీసాతో బాటు 65రూపాయలకు భక్తులకు అంటగడుతున్నారు. సీసా తిరిగి ఇస్తే కొన్ని చోట్ల 30 రూపాయలు వెనక్కు ఇస్తారు. దీన్నిబట్టి లీటరునీటి ధర 35 రూపాయల వరకు భక్తులకు దోపీడీనే. అలాంటిది అవసరమైన ఆహారపదార్థాల ముడిసరుకులు తిరుమలకు రవాణా చేసుకున్నా మరీ రానున్న రోజుల్లో ఈ పెద్ద హోటళ్ళలో భోజనాలు, అల్పాహారాలు ఏ మేరకు ధరలు నిర్ణయిస్తారనేది చూడాల్సిందే.

Read Hindi News : hindi.vaartha.com

Read also : SBI Robbery : 11 కేజీల 400 గ్రాముల బంగారం చోరీ – ఎస్బీఐలో 10 కోట్లకు లెక్కలు

branded hotels Breaking News in Telugu cheap hotels Tirupati Google news Latest News in Telugu Tirumala hotels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.