📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Today News : Tirumala – గోవిందుని వార్షిక బ్రహ్మోత్సవాలు

Author Icon By Shravan
Updated: August 29, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలగిరులు వడ్డీకాసుల శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జరగనున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల కార్యాచరణను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారుచేసింది. ఈ ఏడాది ఒక బ్రహ్మోత్సవం మాత్రమే నిర్వహిస్తారు. వాహనసేవలను ఆలయమాఢవీధుల్లో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంపై, భక్తులకు ఇబ్బంది లేకుండా వాహన సేవలవీక్షణకు సౌకర్యాల కల్పనపై అన్నమయ్యభవనంలో ఇప్పటికే టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి జిల్లాయం త్రాంగంతో కీలక సమావేశం నిర్వహించారు. ఆపదమొక్కులవాడు దేవుడు తిరుమలేశుని ఆలయంలో ఈ ఏడాది.. సెప్టెంబర్ 24వతేదీ నుంచి అక్టోబర్ 2వరకు సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారుచేసినట్లు తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) వైభవంగా విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేపడు తామన్నారు. ఈ ఏడాది కూడా పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, ఇందుకు అనుగుణంగా పటిష్టంగా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనాలు రద్దుచేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు భక్తులు అశేష సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతారు.

Tirumala – గోవిందుని వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విశేష ఏర్పాట్లు, భద్రత కట్టుదిట్టం

సామాన్య భక్తులకు ఎక్కువగా దర్శనసమయం కల్పిం చేందుకు ఆ తొమ్మిదిరోజులు బ్రేక్ దర్శనాలు రద్దుచేశారు. ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు మంజూరుచేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో మొదలయ్యే తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తొలిరోజు సెప్టెంబర్ 24వ తేదీన ధ్వజా రోహణం రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు రాష్ట్రప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 24వతేదీ రాత్రి తొలివాహనంగా పెద్దశేషవాహనం, సెప్టెంబర్ 28 గరుడసేవ, 31న స్వర్ణరథం, 1వతేదీ రధోత్సవం, 2న చక్రస్నానం జరుగుతాయి. పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పించేలా చూడనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో మాఢవీధుల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/cbi-raids-in-railway-hospitals-in-telugu-states/andhra-pradesh/537588/

Andhra Pradesh temple festivals Breaking News in Telugu Govinda annual festival Latest News in Telugu Telugu News Paper Tirumala Brahmotsavam Tirumala rituals Tirupati temple news TTD Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.