📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: ఆణివార ఆస్థానాన ‘లచ్చన’ తాళపు చెవి గుత్తి

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : ఆపదమొక్కులవాడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆణివార ఆస్థానం రోజు బుధవారం ఉదయం పెద్దజీయర్, చిన్నజీయర్, టిటిడి ఇఒ చేతులకు “లచ్చన” తాళపు చెవిగుత్తిని వరుసక్రమంగలో కుడి చేతికి తగిలించారు. “రూపాయి” హారతి చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం తాళపు చెవిగుత్తిని మూలవిరాట్టు వేంకటేశ్వరస్వామి పాదాలచెంత ఉచడంతో ఆస్థానం ముగిసింది. అంతకుముందు బుధవారం ఉదయం ఆనందనిలయంలోని బంగారువాకిలి (Golden gate) లో ఘంటామండపంలో ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు సర్వభూపాల వాహనంలో శ్రీదేవిభూదేవిలతో కలసి మలయప్పస్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేశారు. మరోపీఠంపై స్వామివారి సర్వసైనాధ్యక్షుడు విశ్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపుచేశారు. మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు నివేదించారు.

కాలమానం ప్రకారం

స్వామివారిద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ఏడుకొండలస్వామినే “నిత్యైశ్వర్యోభవ:” అని ఆశీర్వదించారు. వైఖానస ఆగమోక్తంగా కైంకర్యాలు జరిగే తిరుమల వెంకన్న ఆలయంలో ఆణివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతిరోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజు నిర్వహించే కొలువును ఆణివార ఆస్థానంగా పురాణాల్లో పేర్కొన్నారు. పూర్వం మహంతులు ఆలయ పరిపాలనను స్వీకరించిన రోజు కాడంతో టిటిడి (TTD) ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యాయని శాసనాలద్వారా తెలుస్తోంది,. టిటిడి ధర్మకర్తలమండలి ఏర్పడిన తరువాత మార్చినెలకు బడ్జెట్ రూపకల్పన మారింది.

Tirumala: ఆణివార ఆస్థానాన ‘లచ్చన’ తాళపు చెవి గుత్తి

బోర్డు సభ్యులు

ఈ ఆస్థానం సందర్భంగా పెద్దజీయర్స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్దపట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ భక్తితో ఆలయంలోనికి చేరుకున్నారు. నాలుగు పట్టువస్త్రాలు వెంకన్న మూలవిరాట్టుకు, ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విశ్వక్సే నులవారికి అలంకరించారు. కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు (TTD Chairman BR Naidu) దంపతులు, టిటిడి ఇఒ శ్యామల రావు దంపతులు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి దంపతులు, బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పనబాకలక్ష్మి, నరేశ్ కుమార్, శాంతారాం, జానకిదేవి, మహేందర్రెడ్డి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాధం, ఆలయ పేష్కార్ రామకృష్ణ, విఎసీ ఎన్టీవిరామ్కుమార్, అల్లంసురేంద్ర, ఆలయ ఏవిఎస్ రాజశేఖర్, ఆలయ అర్చకులు పాల్గోన్నారు.

తిరుపతి దేవస్థానం ఎప్పుడు నిర్మించారు?

తిరుపతి తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది, దాని నిర్మాణం, అభివృద్ధి వివిధ దశల్లో పూర్తయింది. ఆలయ నిర్మాణం క్రీ. పూ. 300-200 మధ్య కాలంలో జరిగినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

అలిపిరి కి ఆ పేరు ఎలా వచ్చింది?

పూర్వం అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Minister Farooq: మైనారిటీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి – మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్

Anivara Asthanam 2025 Bangaru vakili Breaking News golden gate Tirumala Lakshana key ceremony latest news Srivari temple rituals Srivari Utsavam Tirumala News TTD Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.