ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ నిరంతరంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుమల (Tirumala) కొండపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు..
Read Also: Lokesh : టీడీపీ పతనానికి లోకేశ్ నాంది కాబోతున్నారు – అంబటి
సుమారు 12 గంటల సమయం
టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 75,791 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా, 22,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా నమోదైంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: