📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirumala : పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలపై తర్జన భర్జనలు

Author Icon By Saritha
Updated: November 17, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆఫ్లైన్/ఆన్లైన్ విధానం టోకెన్లు విడుదలపై కుదరని ఏకాభిప్రాయం!,

తిరుమల: కలియుగవైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Tirumala) ఆలయంలో
ధనుర్మాసంలో మోక్షమార్గం వైకుంఠద్వారం పదిరోజులు తెరచి దర్శనాలు చేయించే విధానంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గతంలోలాగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి (డిసెంబర్ 30,31తేదీలు) పర్వదినాలతోబాటు మరో ఎనిమిదిరోజులు ఆన్లైన్లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయడంతోబాటు ఉచిత సర్వదర్శన టైమ్ స్లాట్(ఎస్ఎస్) టోకెన్లు జారీ విధానంపై టిటిడి(TTD) బోర్డు, అధికారులు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బోర్డు, టిటిడి అధికారులు పలు దఫాలుగా సమాలోచనలు చేసినా సామాన్యభక్తులను దృష్టిలో ఉంచుకుని ఎలా అమలుచేస్తే సాఫీగా ప్రశాంతంగా తిరుమలకు చేరుకుని వివాదాలు లేని వైకుంఠద్వార దర్శనం చేసుకోగలరనే విషయంపై అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పదిరోజులకు సంబంధించి తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు అదనంగా ఏర్పాటుచేసి పూర్తిగా ఆన్లైన్లో ఒకేసారి టోకెన్లు జారీచేయాలా లేక ఆయా రోజులకు సంబంధించి ఏరోజుకాముందురోజు టోకెన్లు జారీచేయడం వల్ల సమస్య పరిష్కారం చేయగలమా అనే చర్చ సాగిస్తున్నారు. పదిరోజులకు సంబంధించి టోకెన్లు పూర్తిఅయ్యేవరకు జారీ చేసినా భక్తులు తిరుమలకు చేరుకోవడంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయనేది ప్రధాన సమస్య. అంతేగాక గతంలోలాగా టోకెన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించాలా? లేదా అనేది కూడా ఇప్పుడు గందరగోళంగా మారింది.

Read also: రాజీనామా వదంతులను ఖండించిన డీకే శివకుమార్

Tirumala

గత సమస్యల కారణంగా అధికారుల మల్లగుల్లాలు

ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేకుండా అనుమతించినా భక్తుల రద్దీని నియంత్రించడం కూడా చాలా కష్టంగా మారుతుందనేది అధికారులు మల్లగుల్లాలు పడతున్నారు. డిసెంబర్నెల అందునా వర్షాలు కురిసినా, చలిగాలులు, మంచు ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. దీనివల్ల (Tirumala) తిరుమలకు భక్తులను అనుమతించినా రెండులక్షలమందిచేరితే పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదనేది టిటిడి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఏడాది పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలు దాదాపు 7.80లక్షల మంది భక్తులకు కల్పించారు. ఇందుకోసం 2024 డిసెంబర్నెలలోనే పదిరోజుల ముందే ఆన్లైన్లో (పది రోజులకు) 1.59 లక్షల ఎస్డి టిక్కెట్లు విడుదల చేయడం జరిగింది. అలాగే ఆఫ్లైన్లో (పది రోజులకు) 4లక్షల టైమ్ స్లాట్ (ఎస్ఎస్) ఉచిత టోకెన్లు జారీ చేశారు. వీరేగాక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో వివిఐపిలు, విఐపిలు స్వయంగా వచ్చి వైకుంఠద్వారంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఈ నేపధ్యంలో గత జనవరిలో చోటుచేసుకున్న ఘటనలతో టిటిడి అధికారులు ఇప్పుడు తీసుకోనున్న నిర్ణయంపై దర్శనాలు అనుమతించే విధానం మంగళవారం (రేపు) తిరుమలలో జరగనున్న టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్నాయుడు, ఇఒ అనిల్కుమార్సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఆధ్వర్యంలోసమావేశంలో ఖరారుకానుంది.

గత ఘటనలతోనే అధికారుల్లో భయం!:

సాక్షాత్తు మహావిష్ణువే కలియుగంలో ఏడుకొండలవేంకటేశ్వరస్వామిగా భక్తులను కటాక్షిస్తున్నారని, ఆలయంలోపల వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే పాపాలనుండి విముక్తికలిగి మోక్షం లభిస్తుందని కోట్లాదిమంది భక్తుల విశ్వాసం, ఇదే ప్రగాఢనమ్మకంతో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. 2019వరకు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లోమాత్రమే వైకుంఠద్వారాలను తెరచి భక్తులకు మోక్షం కల్పించేవారు. ఆ రెండురోజులు అన్ని ప్రత్యేక దర్శనాలను . ఆర్జితసేవలు రద్దుచేసి గతంలో ఎలాంటి టోకెన్లేని భక్తులు కూడా తిరుమలకు చేరుకుని సాఫీగా ప్రశాంతంగా 1.80 లక్షలమంది వరకు వైకుంఠద్వార దర్శనం చేసుకునేవారు. అందుకు తగ్గట్లు అప్పటి టిటిడి బోర్డు, ఉన్నతాధికారులు ప్రణాళికలు అమలుచేసి పటిష్టంగా ఏర్పాట్లుతో ముగించేవారు. అయితే 2020వ సంవత్సరం నుండి గత వైసిపి ప్రభుత్వంలోని టిటిడి బోర్డు పెద్దలు పదిరోజులు వైకుంఠద్వారాలను తెరచి భక్తులను అనుమతించేలా చూస్తున్నారు. దీనివల్ల భారీగా భక్తులు తరలివస్తుండటంతో నియంత్రించలేక విఫలమై ఈ ఏడాది జనవరి 8వతేదీ తిరుపతిలో దురదృష్టవశాత్తు ప్రత్యేక కౌంటర్ల వద్ద తోపులాట తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకుని భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

సామాన్యభక్తుల కోసం తర్కభరితమైన ప్రణాళిక అవసరం

దీంతో ఇప్పుడు మళ్ళీ పదిరోజులు వైకుంఠ ద్వారదర్శనాలు కొనసాగిస్తున్నా భక్తులను అనుమతించే విషయంపై కీలక నిర్ణయాలు ఓ కొలిక్కిరాలేదు. పూర్తిగా ఆన్లైన్లో జారీచేస్తే ఎలా అమలుచేయాలి? పూర్తిగా ఆన్లైన్లో జారీచేస్తే సామాన్యభక్తులు, తిరుపతి స్థానికులు అందుకోలేక మరింత గందరగోళం నెలకొనే పరిస్థితులు తలెత్తుతాయి. ఇవన్నీ భేరీజు వేసుకుని డిసెంబర్ 30,31తేదీల్లో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల టోకెన్లు స్థానికులకు మాత్రమే కేటాయిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2026 జనవరి 1వతేదీకి సంబంధించి అన్ని దర్శనాలు రద్దుచేసినా పూర్తిగా మిగిలిన వైకుంఠ దర్శనాలు ఆన్లైన్ చేయడం వల్ల కొంతవరకు భక్తుల రద్దీని నియంత్రించే అవకాశం ఉంటుందనేది అధికారుల ఆలోచన, మరీ రేపు మంగళవారం జరగనున్న టిటిడి బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడనుందనేది భక్తుల్లో ఉత్కంఠగా మారింది.

మోక్షమార్గం దర్శనాలకు అనూహ్యరద్దీ:

తిరుమల ఆలయంలో వైకుంఠద్వారాలను ప్రతి ఏడాది ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో తెరచి దర్శనభాగ్యం కల్పిస్తారు. ఈ రోజుల్లో వైకుంఠద్వారంలో ఇష్టదైవాన్ని దర్శించు కుంటే కష్టాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తిరుమల ఆలయంలో స్వామివారికి కుడివైపున వైకుంఠద్వారం ఉంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లోమాత్రమే 48గంటలు పాటు (రెండు రోజులు మాత్రమే) తెరచివుంచి భక్తులకు దర్శనం కల్పించేవారు. ఆ తరువాత భక్తుల నుండి వస్తున్న అనూహ్యస్పందనతో శ్రీరంగంలోని రంగనాధస్వామి ఆలయం తరహాలో తిరుమల ఆలయంలోనూ పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలు తెరచి సామాన్యభక్తులకు మోక్షం కల్పిస్తున్నారు. సామాన్యభక్తులు, ధనవంతులు టిక్కెట్లు, టోకెన్లు లేకుండా నేరుగా ఆ పది రోజులు తిరుమలకు వస్తే ఆలయంలోనికి ప్రవేశించే అవకాశం కూడా ఉండదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

andhra-pradesh crowd-management darshan-tokens Pilgrims temple-news tirumala TTD Vaikunta-Dwaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.