ప్రకృతిలో ఉన్న జీవ జాతులు పర్యావరణసమ తుల్యతకు దోహద పడతాయన్న విషయం తెలిసిందే. సంచార సరళిలో జీవించే జనాభా, ఎక్కడో దట్టమైన అడవుల్లో కనుచూపు మేరకు చిక్క కుండా తప్పించుకునే జంతు జాతుల లెక్కలు తేల్చా అంటే మామూలుగా అంచనాలకు అందే విషయంకాదు. దేశవ్యాప్తంగా అడవుల్లో సంచరించే పులుల (Tigers)సంఖ్య ఏ మేరకు ఉందో చెప్పనలవికాదు. పర్యావరణానికి పులుల(Tigers)కు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అడవులను రక్షించుకోవాలంటే జంతువుల మనుగడ సాగాలి. జంతువులను కాపాడుకుంటేనే అడవులు పచ్చగా ఉంటాయి. ప్రకృతి విధ్వంసంలో భాగంగాఅడవులను, కొండ లను ధ్వంసం చేసేక్రమంలో అడవుల్లో దాక్కున్నపులులు నగరాల మీదకు వస్తున్నాయి. వాటిని చూసి వామ్మో పులి, అంటూ జనం పరుగులు పెడుతున్నారు. అడవులు చక్కగా ఉన్నంతకాలం అవి అక్కడే మనగుడ సాగించా యి. ఒక్క పులులే కాదు. సమస్త జంతుజాలం అడవులను వదిలిపెట్టి రాలేదు. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అవి ఉంటేనే అడవులు, ప్రకృతి పచ్చగా ఉంటాయి. అలాంటి అడవులను యధేచ్ఛగా నరికేస్తు న్నాం. కొండలను ధ్వంసం చేస్తున్నాం. దీంతో పులులు, చిరుతలు అడపాదడపా అడవుల శివారు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీరుకోసంతంటాలు పడుతున్నాయి. ఇప్పటికే కోతులు మనుష్యులను మించి గ్రామాల్లో సంచరిస్తున్నాయి. వీటిని తరిమికొట్టే చర్యలు తీసుకోవ డం లేదు. దీంతో ఇవి ప్రజల ఆస్తులను, పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజా జీవనాన్ని భయకంపితం చేస్తున్నాయి. కాగా ఇటీవల పులులు పాదముద్రల ఆచూకీ, లేదా పులులు మైదాన ప్రాంతాలలో తిరుగుతున్నాయ న్న జాడలు కన్పిస్తున్నాయి. అందుచే ఎక్కడి పులులు ఎక్కడికి వస్తున్నాయో తెలియదు. ఇకపోతే తెలుగు రాష్ట్రా ల్లో ఈ మధ్య పులులు, చిరుతల సంచారం అడపాదడపా కనిపిస్తోంది. నల్లమల, తిరుమల కొండలతో పాటు తెలం గాణ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వీటి సంచారం బాగా పెరిగింది. అలా అటవీ అధికారుల లెక్కల ప్రకారంఉభయ రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువైంది. ఓ వైపు మహా రాష్ట్రలోని తాడోబా నుంచి, మరో వైపు నల్లమల నుంచి టైగర్లు కొత్త అవాసాలను వెతుక్కుంటూ సరిహద్దుల్లోని పలు జిల్లాల్లో తిరుగుతున్నాయి. తాడో బాలో పులుల సంతతి పెరిగిపోవడం. అంతర్గత సంఘ ర్షణల వల్లే పులులు గోదావరి దాటి ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగు పెడుతున్నాయని అంచనా వేసింది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్మీ దుగా జిల్లాల్లోకి ప్రవేశిస్తు న్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహా రాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ నుంచి ఓ పులి గోదావరి దాటి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలం లో పులులు రిజర్వ్ ఫారెస్ట్ వైపు నుంచి అమ్రాబాద్ వైపు సంగమేశ్వర ప్రాంతం గుండా నదిని దాటుతుంటామ. రెండురాష్ట్రాల సరిహద్దులు దగ్గరగా ఉండటం, అక్కడ నీటి లోతు తక్కువగా ఉండడంతో పులులు కొల్లాపూర్ ఫారెస్ట్ లిమిట్స్ లోని మార్గాన్ని ఎంచుకుంటాయి. ఇప్పుడు పెద్దసంఖ్యలో వస్తున్న పులులను రక్షించడం పెను సవాల్గా మారింది. టైగర్ కారిడార్లోని అడవుల్లో ఇటీవలి కాలంలో సీసీ కెమెరాలు
ఏర్పాటుచేసి పులులను ట్రాక్ చేస్తున్నారు. వాటి కదలిక లను నిత్యం గమనించేందుకు టైగర్ ట్రాకర్లను సైతం నియమించారు. పులుల సంచారం పెరగడంతోపాటు అప్రమత్తం అయ్యారు. ఇలా కంటి చూపుకందకుండా పారిపోయే పులుల సంగతి పసి కట్టా లన్నా అవి ఎక్కడ ఉన్నాయో, ఎన్నేసి ఉన్నాయో ఆచూకీ తెలియాల్సిందే. ఆ రోజులు రానేవచ్చాయి. ప్రతి నాలు గేళ్లకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నిర్వ హించే పులుల గణన కు వేళయింది. ఏదో కాకులు లెక్కల మాదిరి కాకుండా నిర్దిష్టంగా ఎన్నిఉన్నాయో గుర్తించాలదన్న లక్ష్యంతోపాటు వాటి అవసరాల గురించి కూడా సర్వేలోమినహాయిస్తారు. సాంకేతి కతతో పాటు అడవుల్లో ఉన్న జీవజాలం వాటికి తగిన ఆహారం, దొరకుదల వంటి అంశాలన్నీ ఇప్పటి సర్వేలో తేలుతాయి. జంతుజాలానికి ఆహార భద్రత వంటి అంశాల ప్రాముఖ్యత తదితర గమనించదగిన అన్ని విష యాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఇప్పుడున్నది కేవ లం పులుల గణాంక సేకరణకే పరిమితం కాదు. ఇది ఈ ప్రపంచం లోనే అతిపెద్ద వన్యప్రాణుల సర్వే భావించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 36 నుంచి 45 వరకు పులులు ఉన్నాయని చెబుతున్నారు. పులులు సంచరిస్తు అటవీ ప్రాంతాల్లో ఎలాంటి ఉచ్చులు బిగించకూడదని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షిం చుకునే క్రమంలో పులులనుకూడా కాపాడుకోవాల్సి ఉంది. ఈ జాతి మనుగడ సాగించేలా పరిస్థితులు కల్పించాలి. పులులను ఉచ్చులో పడేసిచంపడం, కరెంట్ తీగల పెట్ట డంలా చర్యలు తీవ్రంగా పరిగణించాలి. జాగ్రత్తలు తీసు కుంటున్నా వేటగాళ్ల రూపంలో ప్రాణాపాయ పరిస్థితుల ను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ లో ప్రత్యేక
పరిస్థితులను ఆకళింపు చేసుకుని సర్వే ప్రారం భిస్తున్నారు. ప్రపంచంలోనే అడవుల్లో ఉన్నపులుల జానా భాలో ఎక్కువ భారత్లోనే ఉన్నాయని ఇప్పటికే అంచనాలున్నాయి. 2022 నాటికి 3967 పులులుండగా తాజాసర్వేలో పులుల సంఖ్య ఏపాటిదో తెలుస్తుంది. అప్పు డే పులల సంరక్షణ, నివాస కల్పన వంటి
అంశాలపై జాగ్రత్తలు తీసుకోదగిన అంశాలు తీసుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: