తిరుపతి రాజకీయాలు (Tirupati Politics) మరోసారి కాస్త వేడెక్కుతున్నాయి. కూటమి పార్టీల మధ్యనే కాదు, ఒక్కో పార్టీలోనూ మూడు ముక్కలాట స్పష్టంగా కనిపిస్తోంది. నేతలు ఎవరూ తాము తక్కువ కాదన్న ధోరణి ప్రదర్శిస్తుండటంతో, హైకమాండ్‌లకు ఇది తలనొప్పిగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతి ఇప్పుడు రాజకీయ కేంద్రమైంది.టిడిపి, జనసేన, బిజెపి (TDP, Janasena, BJP)— మూడు పార్టీలలోనూ వర్గపోరు పీక్‌కి చేరింది. పదవుల పంపకం, ఇన్‌ఛార్జ్ నియామకాలు, ఆధిపత్య పోరు ఇలా అనేక అంశాలపై నేతలు తలపడ్డారు. మొదట చల్లగా సాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు రోడ్డుమీదికి వచ్చిన స్థాయికి చేరింది.
Flood Effect : మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
టిడిపి లో పెత్తనం కోసం పోరు
తిరుపతి టిడిపి ఇన్‌ఛార్జ్‌గా సుగుణమ్మ కొనసాగుతుండగా, ఆమెపై వర్గపోరు తీవ్రమైంది. హైకమాండ్ అనేక నామినేటెడ్ పదవులు తిరుపతి నేతలకు ఇచ్చినా అసంతృప్తి తగ్గలేదు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ నియామకం సమయంలో ఈ అసహనం బయటపడింది. ఒకవైపు సుగుణమ్మ, మరోవైపు కోడూరు బాలసుబ్రమణ్యం, ఇంకో వైపు రవి నాయుడు అనుచరులు — ఇలా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వ్యక్తిగత దూషణలు పెరిగాయి.
జనసేనలోనూ విభేదాలు
జనసేనలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మరోవైపు హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ తటస్థంగా వ్యవహరించడంతో, పార్టీ మూడు ముక్కలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం రాలేదని నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్ కూడా ఈ పరిస్థితిపై అసంతృప్తిగా ఉంది.
బిజెపిలోనూ వర్గపోరు స్పష్టంగా
బిజెపి జిల్లాధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకరికి ఒకరు దగ్గరగా లేరన్న భావనతో వర్గాలుగా ఏర్పడ్డారు. భాను ప్రకాష్ వైసీపీపై ఒంటరి పోరాటం చేస్తున్నా, పార్టీ మద్దతు పూర్తిగా లభించడం లేదు. దీంతో కమల దళంలోనూ సఖ్యత లేకుండా పోయింది.టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలూ ఒకే వేదికపై కలిసే పరిస్థితి లేకుండా పోయింది. బయటికి ఐక్యత చూపించే ప్రయత్నం జరుగుతున్నా, అంతర్గతంగా విభేదాలే ఎక్కువ. ఈ తీరుతో మూడు హైకమాండ్లు అసహనానికి గురవుతున్నాయి. తిరుపతి రాజకీయాలు ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఇప్పుడు కూటమి పార్టీలకు నిజమైన పరీక్షగా మారాయి. ఈ రీతిగా తిరుపతి పాలిటిక్స్ కూటమి నేతలకు తలనొప్పిగా మారింది. గ్రూపుల మధ్య పెత్తనం కోసం పోరు ఆగకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చు.
Read Also :